డాలర్లతో డీల్... ఉచ్చులో పడేస్తున్న ముఠా... పోలీసులు ఎలా పట్టుకున్నారంటే...

Uttar Pradesh Crime : డాలర్స్ అంటే చాలు... చాలా మంది వాటిని చూడగానే ఫ్లాట్ అవుతారు. ఎందుకంటే... ఇండియాలో ఉంటూ డాలర్లు సంపాదించడం అంత తేలిక కాదు. చాలా కొద్ది మంది మాత్రమే అలా చేస్తున్నారు. మరి ఆ ముఠా ఏం చేసింది, ఎలా బుట్టలో వేసుకుంటోంది... తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: September 1, 2019, 12:10 PM IST
డాలర్లతో డీల్... ఉచ్చులో పడేస్తున్న ముఠా... పోలీసులు ఎలా పట్టుకున్నారంటే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఉత్తర ప్రదేశ్... ఖడ్కీలోని అదో చిన్నపాటి హోటల్. అక్కడకు టీ తాగడానికి వెళ్లాడు క్యాబ్ డ్రైవర్ కిషోర్ (29). రంగు, రుచి, చిక్కదనం అంతగా లేకపోయినా... అలాగే అడ్జస్ట్ అవుతూ టీ తాగుతున్నాడు. ఇంతలో వెనక టేబుల్ దగ్గర కూర్చున్న నలుగురిలో ఒకడైన కబీర్ సలీమ్... అతని దగ్గరకు వచ్చాడు. "భాయ్... నాకు తెలిసిన ఒకాయన దగ్గర అమెరికా డాలర్లు ఉన్నాయి. ఆయనకు అర్జంటుగా డబ్బు కావాలి. అందువల్ల డాలర్లు ఇచ్చి... మన ఇండియా కరెన్సీ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నా్డు. జస్ట్ లక్ష రూపాయలు ఇస్తే... ఆయన రెండు లక్షల రూపాయలకు సరిపడా డాలర్ల నోట్లు ఇస్తాడు. నీకేమైనా కావాలంటే చెప్పు" అన్నాడు. "లక్షకు... రెండు లక్షలా? సరే... నేను ఆ డాలర్లను ఏం చేసుకోను? వాటిని ఎవరూ తీసుకోరు కదా?" అన్నాడు. "నువ్వు బ్యాంకులో మార్చుకోవచ్చు. డాలర్లు ఇస్తే... వారం రోజుల్లో వాళ్లే నీ అకౌంట్‌లోకి మన కరెన్సీని వేసేస్తారు. మాకు వెంటనే డబ్బు కావాలి కాబట్టి మేం బ్యాంకులో వెయ్యలేకపోతున్నాం" అని చెప్పాడు సలీం. "అవి నిజమైన డాలర్లేనని ఏంటి నమ్మకం?" అని డౌట్ అడిగాడు కిషోర్. "డౌట్ అక్కర్లేదు. ఓ పని చెయ్... ఈ మూడు డాలర్ నోట్లు తీసుకో... ఆ పక్క వీధిలో బ్యాంక్ ఉంది కదా... అక్కడకు తీసుకెళ్లి... ఇవి నిజమైనవో కాదో అడుగు. వాళ్లు నిజమైనవే అంటే... అప్పుడు డీల్ కుదుర్చుకుందాం" అన్నాడు. సరేనన్న కిషోర్... బ్యాంకుకి వెళ్లి అడిగితే... వాళ్లు అవి నిజమైన డాలర్ నోట్లే అన్నారు. ఒక్కోటీ ఒక్కో 20 డాలర్ల నోట్ అనీ... మూడు నోట్లూ కలిపి 60 డాలర్లు అని చెప్పారు. వాటి విలువ రూపాయల్లో రూ.4300 అని చెప్పారు. అంతే... కిషోర్‌కి ఆనందం వేసేసింది. తన బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న రూ.లక్ష రూపాయలు ఇచ్చి... 2 లక్షల రూపాయలకు సరిపడే డాలర్లు తీసుకోవాలని అనుకున్నాడు.

నెక్ట్స్ డే... మధ్యాహ్నం వేళ... కిషోర్... ఓ నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లాడు. తనతో ఓ బ్యాగులో... రూ.లక్ష నోట్ల కట్టలు తీసుకెళ్లాడు. అటు నుంచీ వాళ్లు కారులో వచ్చి... ఓ ప్యాక్ చేసి ఉన్న సంచిని... తెచ్చారు. కిషోర్... తన దగ్గరున్న లక్ష ఇచ్చాడు. వాళ్లు తమ దగ్గరున్న బ్యాగ్ ఇచ్చారు. వాళ్లు కిషోర్‌ని కౌంట్ చేసుకోమన్నారు. సరే అని కౌంట్ చేసుకుందామని ప్రయత్నిస్తుంటే... వద్దొద్దు... కన్‌ఫ్యూజ్ అవుతారు. అవి మొత్తం 20 డాలర్ల నోట్లే. లెక్క తేడా ఉండదు. మమ్మల్ని నమ్మండి. బయట ఎవరైనా చూస్తే, అందరం బుక్కవుతాం. ఇంటికి వెళ్లి... ప్రశాంతంగా కౌంట్ చేసుకోండి. మాకు టైమ్ లేదు... అంటూ హడావుడి చేశారు. నిజమే అయివుంటుందనుకున్న కిషోర్... తనకు డాలర్-రూపాయి మారకపు విలువ తెలియకపోవడంతో... వాళ్ల ముందు... సరే అన్నట్లుగా తలూపాడు. వాళ్లు కారులో వేగంగా వెళ్లిపోయారు.

ఇంటికి వెళ్లి చూసుకుంటే... అందులో న్యూస్ పేపర్ కట్టలు, బట్టల సబ్బులు మాత్రమే ఉన్నాయి. షాకైన కిషోర్‌కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. పోలీసులకు చెబితే... తననే తప్పు పడతారేమో అని మొదట బయపడ్డాడు. తర్వాత ధైర్యం తెచ్చుకున్నాడు. నెక్ట్స్ పీఎస్‌కి వెళ్లి... జరిగింది మొత్తం చెప్పాడు. పోలీసులకు ఇదివరకు కూడా ఇలాంటి కంప్లైంట్లు కొన్ని వచ్చాయి. ఆ గ్యాంగ్ కోసం వాళ్లు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

కిషోర్ చెప్పినట్లుగా... ఆ హోటల్‌కి వెళ్లి... సీసీ కెమెరాలు ఉన్నాయేమోనని చూశారు. అక్కడ అలాంటివేవీ లేవు. ఐతే... అక్కడి బ్యాంకులో... ఉద్యోగి... ఆ మూడు డాలర్ల నోట్లను చెక్ చేసినప్పుడు... అవి నిజమైనవో కాదో తెలుసుకునేందుకు... వాటి కోడ్ నంబర్లు నోట్ చేశాడు. ఆ కోడ్ నంబర్లను పోలీసులు తీసుకున్నారు. వాటి ఆధారంగా... అవి ఏ విదేశీ అకౌంట్ నుంచీ డ్రా చేసిందీ తెలుసుకున్నారు. అలా... కేటుగాళ్ల అడ్రెస్ తెలిసింది. వెంటనే అక్కడకు వెళ్లారు. ఆల్రెడీ లక్షలో రూ.20 వేలు ఖర్చు పెట్టి... మందు, మంచింగ్ అన్నీ కొనుక్కొని... ఇండియా-వెస్టిండీస్ మ్యాచ్ చూస్తూ... తెగ ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ నలుగురు. వెంటనే వాళ్లను పట్టుకొని ఉతికారేశారు. రూ.80వేలు రికవరీ అయ్యాయి. అలాగే... 1,623 డాలర్ నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ 20 డాలర్ల నోట్లే. కోర్టు వాళ్లను ఐదు రోజుల పోలీస్ కస్టడీకి పంపింది. మోసాల్లో రకరకాలు. ఇది మరోరకం అన్నమాట.
Published by: Krishna Kumar N
First published: September 1, 2019, 12:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading