Home /News /crime /

UTTAR PRADESH MINOR GIRL MOLESTED BY RELATIVE DURING WEDDING FUNCTION ACCUSED ON THE RUN PAH

Shocking: పెళ్లి వేడుకలో దారుణం.. బాలికపై సమీప బంధువు అత్యాచారం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uttar Pradesh: మేన మామ పెళ్లిని ఎంజాయ్ చేయడానికి బాలిక వచ్చింది. పెళ్లి వేడుకలలో జోష్ గా పాల్గొంది. ఈ క్రమంలో సమీప బంధువు ఆమెపై కన్నేశాడు.

ప్రభుత్వాలు మహిళల భద్రతకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కామాంధులలో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు. ప్రతిరోజు మహిళలపై అత్యాచార ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. దిశ, పోక్సో, నిర్భయ వంటి కఠిన చట్టాలు ఉన్నప్పటికి కామాంధులలో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు. అనేక చోట్ల తెలిసిన వారే మహిళలు, బాలకలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh)  దారుణం జరిగింది. బందా పరిధిలోని ఒక బాలిక తన మేనమామ పెళ్లి ఈ నెల 23 న నిశ్చయమైంది. ఈ క్రమంలో బాలిక పెళ్లి వేడుకకు హజరైంది. ఉల్లాసంగా పాల్గొంది. అయితే, ఆమె సమీప బంధువు బాలికపై కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పాడు. బాలికను గదిలోనికి తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారానికి (rape on girl) పాల్పడ్డాడు. ఆతర్వాత.. ఎవరికైన చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక భయపడిపోయింది.

బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఏమైందని నిలదీశారు. ఈ క్రమంలో బాలిక జరిగిన దారుణాన్ని తెలిపింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన తర్వాత నుంచి నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా పింపుల్స్ తగ్గడం లేదనే సిల్లి రిజన్ తో యువతి అఘాయిత్యానికి పాల్పడింది.

ఉత్తర ప్రదేశ్ లో  (Uttar pradesh) దారుణం జరిగింది. బిసంద పోలీస్ స్టేషన్ పరిధిలోని అజిత్ పారా గ్రామంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఒక యువతికి మోహం మీద పింపుల్స్  (Pimples)  వచ్చాయి. ఎన్ని చికిత్సలు చేయించుకున్న అవి తగ్గలేదు. ఆమెకు పింపుల్స్ కారణంగా, ఆమెతో స్నేహం చేయడానికి ఇష్టపడేవారు కాదు. ఆమె అందంగా లేదని, ముఖంపై పింపుల్స్ ఉన్నాయని పెళ్లి చూపులకు వచ్చిన వారు ఆమెను రిజక్ట్ చేశారు.

దీంతో యువతి మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైంది. సోమవారం తన ఇంట్లో పశువులకు దానా పెట్టి ఆమె తన గదిలోకి వెళ్లింది. ఇంటిలో ఎవరు లేనిది చూసి ఆత్మహత్యకు పాల్పడింది. యువతి ఎంత సేపటికి డోర్ తీయకపోవడంతో కుటుంబ సభ్యులు కిటికి నుంచి చూశారు. అప్పుడు ఆమె ఉరికి వేలాడుతూ విగత జీవిగా కన్పించింది. వెంటనే డోర్ పగలగొట్టి ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Uttar pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు