Home /News /crime /

UTTAR PRADESH MATHURA YOUTH KILLS MINOR GIRL FOR NOT ACCEPTING FRIEND REQUEST ON FACEBOOK PAH

దేవుడా.. వీడు మనిషేనా.. ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదని ఇలా చేస్తారా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uttar pradesh: యువకుడు బాలికకు ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. ఆమె ఎంతకి దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. దీంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. పలుమార్లు ఫోన్ చేసి యాక్సెప్ట్ చేయాలని బెదిరించాడు.

కొందరు చిన్న విషయాలకే కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తుంటారు. కొంత మంది కేటుగాళ్లు.. అమ్మాయిలను, మహిళలను హింసిస్తుంటారు. అమ్మాయిలను ప్రేమపేరుతో వేధిస్తుంటారు. తమకు ఇష్టం లేకున్న యువతుల వెంట పడుతూ  ప్రేమించాలని ఇబ్బందులకు గురిచేస్తారు. తరచుగా అమ్మాయిని ఫాలో అవ్వడం, ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించడం చేస్తుంటారు. యువతి ఇష్టం లేదన్నా.. అసలు ఈ వేదవలు అసలు పట్టించుకోరు. కొన్ని సార్లు.. వీరు షాడిస్టులుగా మారుతారు. మనం తరచుగా సోషల్ మీడియా (Social media) వేదికగా అమ్మాయిలు వేధింపులకు గురైన అనేక వార్తలు చూశాం. ఈ కోవకు చెందిన మరో ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) దారుణం జరిగింది. మథుర జిల్లాలోని నాగ్లా బోహ్ర గ్రామంలో ఈ ఘటన ఆదివారం అర్థరాత్రి జరిగింది. కాగా, తేజ్వీర్ సింగ్, సునీత భార్యభర్తలు. వీరికి 16 ఏళ్ల కూతురు ఉంది. తేజ్వీర్ సింగ్.. సెక్యురిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో.. ముజఫర్ నగర్ కు చెందిన రవి అనే యువకుడు.. తేజ్వీర్ సింగ్ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. దీంతో అతని కూతురితో తరచుగా మాట్లాడేవాడు. ఈ క్రమంలో వీరి మధ్య పరిచయం ఏర్పడింది.



రవి, తేజ్వీర్ సింగ్ కూతురుకి ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ (Face book) పెట్టాడు. అయితే, దీనికి ఆమె అంగీకించలేదు. చాలా రోజులు చూశాడు. ఒక రోజు కోపంతో బాలిక ఇంటికి వచ్చాడు. పెళ్లి పత్రికలు (Face book request) ఇవ్వాలనే బాలిక ఇంటికి ఆదివారం అర్ధరాత్రి వచ్చాడు. ఆ తర్వాత.. బాలికను పెళ్లి పత్రిక తీసుకొవాలని కోరాడు. అప్పటిక కత్తి సిద్ధంగా ఉంచుకున్న రవి.. వెంటనే బాలికపై దాడి చేశాడు. దీంతో తల్లి షాక్ కు గురైంది. అయిన అతను ఇష్టమోచ్చినట్లు బాలికపై దాడిచేశాడు.

దీంతో బాలిక కుప్పకూలిపడిపోయింది. ఆమె తల్లిని కూడా కత్తితో గాయపర్చాడు. అతను కూడా కత్తితో (Brutally murder)  పొడుచుకున్నాడు. వెంటనే అక్కడ స్థానికులు చేరుకున్నారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. బాలిక చికిత్స పొందుతూ చనిపోయింది. బాలిక తల్లికి, నిందితుడినికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తేజ్వీర్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Facebook friend, Harassment, Uttar pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు