• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • UTTAR PRADESH MAN SELLS HIS DAUGHTER FOR RS 2 LAKH AFTER HE FAILING TO PAY DEBT IN MEERUT SU

కన్న కూతురిని అమ్మేసిన కీచక తండ్రి.. ఏడాది పాటు బందీగా బాధితురాలు..

కన్న కూతురిని అమ్మేసిన కీచక తండ్రి.. ఏడాది పాటు బందీగా బాధితురాలు..

ప్రతీకాత్మక చిత్రం

ఓ తండ్రి కన్న కూతురినే అమ్మేశాడు. తీసుకున్న అప్పు చెల్లించలేక ఈ ధారుణానికి ఒడిగట్టాడు.

  • Share this:
    ఓ తండ్రి కన్న కూతురినే అమ్మేశాడు. తీసుకున్న అప్పు చెల్లించలేక ఈ ధారుణానికి ఒడిగట్టాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఘజియాబాద్ జిల్లాకు ఓ కుటుంబం పార్తాపూర్‌ ప్రాంతోని శతాబ్దినగర్‌లో నివాసం ఉంటుంది. నిందితుడు ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో అతనిపై అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇందుకు సంబంధించి కొన్నాళ్లు అతడు తీహార్, దాస్నా జైళ్లలో శిక్ష అనుభవించాడు. అయితే అతడు బరాట్ జిల్లాలో నివసిస్తున్న వ్యక్తి నుంచి రూ. 2 లక్షల రుణం తీసుకున్నాడు. అయితే ఆ రుణాన్ని తిరిగి చెల్లించడంలో నిందితుడు విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అప్పుకు బదులు తన కూతురిని అతనికి విక్రయించాడు. ఆ తర్వాత అప్పు ఇచ్చిన వ్యక్తి బాధితురాలిని ఒక సంవత్సరం పాటు బంధిగా ఉంచుకున్నాడు. ఆ సమయంలో బాధిత యువతిపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడు. అయితే కొద్ది రోజుల క్రితం యువతి అక్కడి నుంచి తప్పించుకుంది.

    అనంతరం తల్లి సాయంతో మీరట్ ఎస్పీ రామర్జ్‌ను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయంపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను లైంగిక వేధింపుకులకు గురైనట్టుగా ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త కూతురిని హింసించినట్టుగా బాధితురాలి తల్లి కూడా పోలీసులకు తెలిపింది. అడ్డుకునేందకు ప్రయత్నించిన సమయంలో తనపై కూడా దాడి జరిగిందని ఆరోపించింది.

    ఈ ఘటనపై మీరట్ ఎస్పీ రామర్జ్ స్పందిస్తూ.. బాధితురాలి ఫిర్యాదుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించినట్టు తెలిపారు. నిందితులను తప్పకుండా శిక్షిస్తామని వెల్లడించారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు