• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • UTTAR PRADESH MAN KILLS HIS WIFE FOR THIS SILLY REASON AND ARRESTED BY POLICE SRD

Crime : అది లేటయ్యిందని భార్యను కిరాతకంగా చంపిన భర్త.. కుమారుడిపై కూడా దాడి..

ప్రతీకాత్మక చిత్రం

Crime : కాసేపు ఆగమని భర్తకు చెప్పింది. మత్తు తలకెక్కిన ఆ భర్తకు భార్య మాటలు చెవికెక్కలేదు. క్షణికావేశంలో చేయకూడని పని చేశాడు.

  • Share this:
    ఈ రోజుల్లో మానవ సంబంధాలు మంట గలిసి పోతున్నాయి. ఇక, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు సహజం. ఎవరో ఒకరు అర్థం చేసుకుని సర్దుకుపోతేనే సంసారం సాఫీగా సాగిపోతుంది. లేకపోతే.. రోజూ ఇంట్లో గొడవలు, వాగ్వాదాలు. భార్యాభర్తలిద్దరికీ ప్రశాంతత ఉండదు. భర్త తాగుబోతు అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా తాగి, కిరాతకానికి ఓడిగట్టాడు ఓ భర్త. వివరాల్లోకెళితే.. భోజనంలో సలాడ్‌ అందించడం ఆలస్యమైందని భర్త తన భార్య దాడి చేసి హత్య చేశాడు. దీంతోపాటు 22 ఏళ్ల కుమారుడిని తీవ్రంగా కొట్టి గాయ పర్చాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం సృష్టించింది. షామ్లి జిల్లా గోగవన్‌ జలాల్‌పూర్‌లో ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన అనంతరం నిందితుడు పరారయ్యాడు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. యూపీకి చెందిన మురళి కుమార్ (45), సుదేశ్‌ భార్యాభర్తలు. భార్య రాత్రి వేళ భోజనంలో పండ్ల సలాడ్‌ అందిస్తుండేది. సోమవారం రాత్రి తాగి వచ్చి మురళి సలాడ్‌ ఇవ్వాలని భార్యను అడిగాడు. అయితే ఆమె వేరే పనిలో ఉండి సలాడ్‌ ఇవ్వడం ఆలస్యమైంది.

    కాసేపు ఆగమని భర్తకు చెప్పింది. మత్తు తలకెక్కిన ఆ భర్తకు భార్య మాటలు చెవికెక్కలేదు. దీంతో ఆగ్రహానికి గురైన మురళి భార్యతో గొడవపడ్డాడు. అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అకస్మాత్తుగా అర్ధరాత్రి వచ్చిన మురళి కొడవలి తీసుకుని భార్యపై విచక్షణ రహితంగా దాడి చేసి చంపాడు. అడ్డుకోబోయిన కుమారుడిపై కూడా దాడి చేశాడు. అతనికి తీవ్ర గాయాలపాలయ్యాయి.

    అనంతరం నిందితుడు మురళి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న సుదేశ్‌, ఆమె కుమారుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సుదేష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుమారుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మురళీ కుమార్ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు స్థానిక పోలీసు అధికారులు తెలిపారు.
    Published by:Sridhar Reddy
    First published: