Home /News /crime /

UTTAR PRADESH MAN KILLS BROTHER TO CLEAR WAY AFTER FALLING IN LOVE WITH SISTER IN LAW

Affair: తల్లి లాంటి వదినపై కన్నేసిన నీచుడు.. సోదరుడు హెచ్చరించిన మారలేడు.. చివరకు ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uttar pradesh: ప్రస్తుత సమాజంలో కొందరు పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. వావీ, వరుసలు మరిచిపోయి దారుణాలకు పాల్పడుతున్నారు. ఒక వ్యక్తి తన వదిన పట్ల కొన్ని రోజులుగా అసభ్యంగా ప్రవర్తించసాగాడు.

UP Man Kills Brother  Falling In Love With Sister In Law: యూపీలో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. ఒక నీచుడు తల్లిలాంటి వదినపై కన్నేశాడు. అంతటితో ఆగకుండా.. సోదరుడిని చంపేస్తే.. వదిన తన సొంతమవుతుందని ప్లాన్ వేశాడు. నేటి సమాజంలో జరుగుతున్న కొన్నిసంఘటనలు చూస్తుంటే.. కొందరు పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. తమ వాళ్లపైనే, అఘాయిత్యాలకు తెగపడుతున్నారు. ప్రభుత్వాలు, మహిళలు, యువతులపై హింసలు, అకృత్యాలు నిరోధించడానికి ఎంతటి కఠిన చట్టాలు తెచ్చిన వీళ్లలో మార్పు రావడం లేదు. ప్రతి రోజు మహిళలపై జరుగుతున్న దాడులు వార్తలలో నిలుస్తున్నాయి. ఇలాంటి సంఘటన ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాలు.. లక్నోలోని చిన్ హాట్ ప్రాంతంలో అమానుషం జరిగింది. మోహిల్ అనే వ్యక్తి తన భార్య తో కలిసి ఒక అపార్ట్ మెంట్ లో ఉంటున్నాడు. వీరి ఇంటికి సమీపంలోనే భూపేంద్ర సాహు అనే వ్యక్తి ఉంటున్నాడు. ఇతను.. మోహిల్ కు వరసకు సోదరుడు. ఈక్రమంలో.. ఇతను.. మోహిల్ ఇంటికి తరచుగా వచ్చిపోతుండేవాడు. తెలిసిన వాడే కావడంతో.. వారుకూడా ఎలాంటి అనుమానం పడేవారు కాదు. అయితే, భూపేంద్ర సాహు, మోహిల్ భార్యపై కన్నేశాడు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్లేవాడు. ఆ తర్వాత.. ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు.

అతగాడి వేధింపులు భరించలేక.. చివరికి తన భర్తకు దారుణాన్ని చెప్పింది. దీంతో మోహిల్, సాహును హెచ్చరించాడు. పద్ధతి మార్చుకొవాలని సూచించాడు. దీంతో మరింత రెచ్చిపోయిన.. సాహు.. మోహిల్ ను అంతం చేస్తే.. తన లైన్ క్లియర్ అయిపోతుందని అనుకున్నాడు. దీని కోసం ఒకరోజు కత్తి తీసుకుని మోహిల్ ఇంటికి వెళ్లాడు. అప్పుడు.. సాహు ఇంటిలో ఉన్నాడు. అతని భార్య.. ఇంటిపైన పెంట్ హౌస్ లో పడుకుంది. ఈ క్రమంలో.. సాహు.. కత్తితో మోహిల్ పై విరుచుకుపడ్డాడు. మెడను కోసేశాడు. ఆ తర్వాత.. అక్కడి నుంచి పారిపోయాడు.

మోహిల్ భార్య.. కిందకు వచ్చి చూసేసరికి తన భర్త రక్తపు మడుగులో ఉన్నాడు. వెంటనే చుట్టుపక్కల వారిని పిలిచింది. పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే మోహిల్ చనిపోయాడు. వీరి బంధువులు.. భూపేంద్ర సాహునే ఈ దారుణానికి ఒడిగట్టారని తెలిపారు. దీంతో పోలీసులు అతని కోసం గాలించారు. నిందితుడిని పట్టుకున్నారు. భూపేంద్ర సాహు నేరాన్ని ఒప్పుకున్నాడు. తమ సోదరుల మధ్య మోహిల్ .. భార్య గొడవలు సృష్టించిందని అందుకే హతమార్చానని తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Harassment on women, Uttar pradesh, WOMAN

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు