కొంత మంది వివాహ బంధానికున్న గొప్ప తనానికి మచ్చను తీసుకుస్తున్నాడు. చిన్న వాటికి ఆలుమగలు గొడవలు పెట్టుకుంటున్నారు. కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే... మరికొందరు హత్యలు చేయడానికి సైతం వెనుకాడం లేదు. కొంత మంది అనుమానంతో తాము.. పెళ్లి (Wedding) చేసుకున్నవారిని చంపుతున్నారు. కొంత మంది వివాహం తర్వాత. కూడా వివాహేతర సంబంధాలు (Affairs) కొనసాగిస్తున్నారు. ఒక వేళ రంకు బయటపడితే సూసైడ్ లు చేసుకుంటున్నారు. ఇంకొందరు హత్యలు సైతం చేస్తున్నారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) దారుణం చోటు చేసుకుంది. అసోథమ్ ప్రాంతంలో శివబరన్ శర్మ (68), లలిత (66) దంపతులు. వీరికి బబ్లూ అనే కొడుకు ఉన్నాడు. కాగా, శివబరన్ శర్మ బుధవారం.. తన భార్య ఆరుబయట పడుకుని ఉండటాన్ని గమనించాడు. ఆ తర్వాత.. మెల్లగా వెళ్లి నిద్రలో ఉన్నన లలితపై కత్తితో దాడిచేసి (brutally murder) హత్యచేశాడు. ఆ తర్వాత అక్కడే ఒక పక్కన ఏమి జరగనట్లు కూర్చొని ఉన్నాడు.
పొద్దున తన తల్లి రక్తపు మడుగులో ఉండటాన్ని బబ్లూ గమనించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. శివబరన్ తాను.. తన భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. వెంటనే అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదిలా ఉండగా ముగ్గురు పిల్లల తల్లిపై సామూహిక అత్యాచారం చేసి చంపేశాడు.
తమిళనాడు(Tamilnadu)లో దారుణం జరిగింది. ఓ వివాహితపై ఆరుగురు వలస కార్మికులు సామూహిక అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశారు. తమిళనాడులోని రామేశ్వరంలో మంగళవారం ఈ దారుణ ఘటన జరిగింది. రామేశ్వరంలోని వడకాడు గ్రామానికి చెందిన 45 ఏళ్ల మత్స్యకార మహిళ వడకాడు మత్స్యకార గ్రామంలో మంగళవారం ఉదయం చేపల కోసం వెళ్లింది. చాలాసేపు అయినా ఇంటికి తిరిగి రాకపోవడం వల్ల ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇంతలోనే గ్రామంలో ఉన్న రొయ్యల ఫామ్లో ఓ మహిళ మృతదేహం పాక్షికంగా కాలిపోయి పడి ఉందని పోలీసులకు సమాచారం అందింది. అది బాధితురాలి మృతదేహం అని తేల్చారు. ముగ్గురు పిల్లలకు తల్లి అయిన ఆమెను నిందితులు గతంలో పలుమార్లు వేధించారు. విషయం తెలుసుకున్న ఆమె భర్త ఆ యువకులను మందలించి వదిలేశాడు. ఈ నేపథ్యంలోనే మంగళవారం సముద్రతీరాని కి వెళ్లిన మహిళపై ఆరుగులు యువకులు అత్యాచారం చేశారు. అనంతరం ఆమె చీరను మెడకు బిగించి హత్య చేసి, పెట్రోల్ పోసి తగులబెట్టారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.