కొంత మంది యువకులు.. కావాలనే గొడవలు పెట్టుకుంటారు. ప్రతి దానికి మరోకరితో వాగ్వాదానికి దిగుతుంటారు. మనం తరచుగా బయట కొంద మంది పోకిరీలు.. బస్టాండ్ లలో, రైల్వే స్టేషన్ లలో, బహిరంగ ప్రదేశాలలో ఇతరులను వేధిస్తుంటారు. కావాలనే గొడవలు పెట్టుకుంటారు. ఇది వాగ్వాదంతో మొదలై.. చివరకు కొట్టుకొవడం వరకు కూడా వెళ్తుంది. కొంత మంది.. కర్రలతో, బ్యాట్ లతో, రాడ్ లతో గొడవల పడుతుంటారు. ఇలాంటి సంఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) దారుణమైన ఉదంతం వెలుగులోనికి వచ్చింది. కక్రా ఖుర్ద్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇఫ్తేకర్ అనే వ్యక్తిని, కొంత మంది యువకులు టార్గెట్ చేసుకున్నారు. అతడితో నలుగురు యువకులు గొడవకు దిగారు. విచక్షణ రహితంగా కొట్టారు. అతను వద్దని బతిమాలిన వదల్లేదు. అంతటితో ఆగకుండా అతనిపై అందరు కలిసి, ముఖం మీద మూత్ర విసర్జన కూడా చేశారు. దీంతో బాధితుడు కుప్పకూలి కిందపడి పోయాడు.
ఆ తర్వాత.. అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, కల్విందర్, జీతా, సోను, అలియాస్ సుఖ్దేవ్, రాజులు దాడిచేసినట్లు పోలీసులు విచారణలో తెలింది. బాధితుడిని చేతులు కట్టేసి , కొట్టినట్లు తెలుస్తోంది. దీని వెనుక ఉన్న కారణాల గురించి ఎస్పీ మాట్లాడుతూ, పాత శత్రుత్వం కారణంగా గతంలో ఇఫ్తేకర్ స్నేహితుడు నిందితుడితో వాగ్వాదం జరిగిందని.. ఫలితంగా ఈ సంఘటన జరిగిందని తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉండగా ఒడిశాలో (Odisha) అమానవీయ ఘటన వెలుగులోనికి వచ్చింది.
ఢెంకనాల్ జిల్లాలోని చంద్రశేఖర్పూర్ గ్రామంలో దారుణం జరిగింది. నకఫోడి మాఝీ అనే వ్యక్తి తన భార్యను నరికి చంపి, తలతో ఊరిలో ప్రయాణించాడు. అతడిని ఇద్దరు పిల్లలు. తన భార్యపై ఎప్పుడు అనుమానంతో ఉండేవాడు. భార్య ఎవరితో మాట్లాడిన.. అందంగా ముస్తాబైన ఆరోజు ఇంట్లో నానా హంగామా చేసేవాడు. ఈ క్రమంలో.. అతగాడు.. తన భార్యను కత్తితో నరికి చంపాడు. ఒడిశాలో (Odisha) అమానవీయ ఘటన వెలుగులోనికి వచ్చింది.
ఢెంకనాల్ జిల్లాలోని చంద్రశేఖర్పూర్ గ్రామంలో దారుణం జరిగింది. నకఫోడి మాఝీ అనే వ్యక్తి తన భార్యను నరికి చంపి, తలతో ఊరిలో ప్రయాణించాడు. అతడిని ఇద్దరు పిల్లలు. తన భార్యపై ఎప్పుడు అనుమానంతో ఉండేవాడు. భార్య ఎవరితో మాట్లాడిన.. అందంగా ముస్తాబైన ఆరోజు ఇంట్లో నానా హంగామా చేసేవాడు. ఈ క్రమంలో.. అతగాడు.. తన భార్యను కత్తితో నరికి చంపాడు.
ఆ తర్వాత.. తలను, మొండెం నుంచి వేరు చేసి, దాదాపు 12 కిలో మీటర్లు ప్రయాణం చేశాడు. అయితే, అతగాడి చేతిలో మహిళ తల ఉండటాన్ని చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోనికి దిగిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నిందితుడు.. నకఫోడి మాఝీని అదుపు లోనికి తీసుకున్నారు. అతడిని అదుపు లోనికి తీసుకుని విచారించగా.. తన భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు అంగీకరించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Attack, Crime news, Uttar pradesh