కొంత మంది పవిత్రమైన పుణ్యకేత్రాలకు వెళ్లి అసహ్యమైన పనులు చేస్తు ఉంటారు. దేవాలయాల పరిసరాల్లో ఇష్టమోచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. కొన్ని చోట్ల దేవాలయాల ప్రత్యేక గదుల్లో, ప్రైవేటు లాడ్జీల్లో కూడా అసాంఘీక కార్యకలాపాలు చేస్తుంటారు. కొంత మంది భార్యభర్తలమని చెప్పి నీచమైన పనులు చేస్తుంటారు.ఇలాంటి అనేక సంఘటనలు గతంలో వెలుగులోనికి వచ్చాయి. మెయిన్ గా గంగా నదిని మన హిందు సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. నదిలో ఆయాదేవతలు కొలువై ఉంటారని భక్తులు నమ్ముతారు. మహిమ గల నీరులో.. స్నానం చేస్తే.. తమ వ్యాధులు, ఏవైన దోషాలు ఉంటే పోతాయని నమ్ముతారు.
అందుకే భక్తులు నదీ జలాలను ఎంతో పవిత్రంగా భావిస్తారు. సంవత్సరానికి ఒక్కసారైన భక్తులు గంగానదీ స్నానాలకు వెళ్తుంటారు. ఇక పుష్కారాల సమయంలో భక్తులు రద్దీ మనం చూస్తునే ఉంటాం.అంతటి పవిత్రమైన నదీలో కొంత మంది, అసహ్యమైన పనులు చేస్తు ఉంటారు. నదిలో ఉమ్మివేయడం, మలమూత్ర విసర్జన చేయడం,చెత్త వేయడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి అనేక సంఘటనలు గతంలో జరిగాయి. దీనిపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, పవిత్రమైన నదిలో స్నానం (Ayodhya River) చేస్తు ఒక జంట రొమాన్స్ చేస్తు అడ్డంగా దొరికిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
अयोध्या: सरयू में स्नान के दौरान एक आदमी ने अपनी पत्नी को किस कर लिया. फिर आज के रामभक्तों ने क्या किया, देखें: pic.twitter.com/hG0Y4X3wvO
పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) ఈ ఘటన జరిగింది. పవిత్రమైన అయోధ్య నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇంతలో ఇద్దరు భార్యభర్తలు నదిలో స్నానం (Ayodhya kissing wife) చేయడానికి దిగారు. ఆ తర్వాత.. వారు చుట్టు పక్కన నదిలో జనాలు ఉన్నారన్న విషయం కూడా మరిచిపోయారు. ఒకరిని మరోకరు హగ్ చేసుకుని.. ముద్దులు పెట్టుకుంటున్నారు. దీన్ని కొంత మంది భక్తులు గమనించారు. వెంటనే వారి దగ్గరకు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని.. నదినుంచి బైటకు లాగారు.
ఒడ్డుమీద తీసుకెళ్లి .. పొట్టు పొట్టు కొట్టారు. అతని..భార్య జనాలను ఆపాలని చూసి ఎవరు వినిపించుకోలేదు. మనోడి.. చెంపలు, వీపు విమానం మోత మోగించారు. దీనిపై స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన నదిలో ఇలాంటి పాడు పనులను సహించబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (social media) వైరల్ గా (Viral video) మారింది. ఘటనపై అయోధ్య ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీనిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొవాలని స్థానిక పోలీసులు ఆదేశించారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.