Home /News /crime /

UTTAR PRADESH MAN ARRESTED SOLD CHICKEN WRAPPED IN PHOTOS OF GODS SAY COPS PAH

దేవుళ్ల చిత్రపటాల పేపర్లలో చికెన్ విక్రయం.. విచారణ కోసం వెళ్లిన పోలీసులపై..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uttar Pradesh: దేవుళ్ల చిత్రాపటాలున్న కాగితాలలో చికెన్ విక్రయిస్తున్నాడు. దీన్ని మరోక వర్గానికి చెందిన కొంత మంది స్థానికులు వ్యతిరేకించారు. ఇలా చేయడం మానుకోవాలని అతడికి సూచించారు.

మన దేశంలో అనాదీగా భిన్నత్వంలో ఏకత్వం పాటిస్తుంటాం. ఇతర మతాల ధర్మాలు, పద్ధతులు, ఆచారాలు, కట్టుబాట్లను పరస్పరం గౌరవించుకుంటాం. మన పండగలకు ఇతర మతస్థులను మన ఇంటికి ఆహ్వానిస్తుంటాం. అలాగే వారు కూడా.. వారి పండుగలకు మనల్ని ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇస్తుంటారు. ఇలా పరస్పరం సోదరభావంతో మెలుగుతాం. కానీ కొంత మంది మత ఛాందస వాదులు, దుర్మార్గులు ఇరు వర్గాలు, మతాలలో ఏదో ఒక చిచ్చు పెడుతుంటారు. కలిసి, ప్రేమతో ఉన్న వాళ్లని ఏదో ఒక గొడవ రేపి.. వివాదాలకు నిప్పు రాజేస్తుంటారు.

ఇలాంటి సందర్బాలలో రెండు వర్గాల మధ్య గొడవలు జరిగి అవి హత్యల వరకు వెళ్తున్నాయి. ఇలాంటి అనేక ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. ఈ కోవకు చెందిన మరో ఘటన సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా మారింది.





పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) ఈ ఘటన జరిగింది. సంభాల్ పట్టణానికి చెందిన తాలిబ్ హుస్సేన్ కు చికెన్ దుకాణం ఉంది. అయితే, అతను తన దుకాణంలో చికెన్ వచ్చిన కస్టమర్ లకు, చికెన్ ను హిందు దేవుళ్లున్న కవర్ లో ప్యాక్ చేసి ఇస్తున్నాడు. దీనిపై కొంత మంది హిందువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇది తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, పద్దతి మార్చుకోవాలని సూచించారు.



అయితే... అతను దీన్ని పట్టించుకోలేదు. ఈ క్రమంలో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తాలిబ్ హుస్సెన్ దుకాణానికి వెళ్లారు. అయితే, అతను పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. వారిపైన కత్తులతో దాడికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు.. తాలిబ్ పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Uttar pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు