హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG: ఉపాధ్యాయుడి నిర్వాకం.. కుండలోని నీళ్లు తాగినందుకు బాలికను కొట్టాడు.. కారణం ఏంటంటే..

OMG: ఉపాధ్యాయుడి నిర్వాకం.. కుండలోని నీళ్లు తాగినందుకు బాలికను కొట్టాడు.. కారణం ఏంటంటే..

ఉపాధ్యాయుడు కళ్యాణ్ సింగ్

ఉపాధ్యాయుడు కళ్యాణ్ సింగ్

Uttar pradesh: బాలికకు దాహం వేసింది. తన తరగతిలో ఉన్న కుండలోని నీళ్లు అయి పోయాయి. దీంతో ఆమె పక్కనే ఉన్న మరోక గదిలో ఉన్న కుండలోని నీళ్లు తాగి తన దాహాన్ని తీర్చుకుంది. ఇది చూసిన ఉపాధ్యాయుడు రెచ్చిపోయాడు. ఆమెను నోటి కొచ్చినట్లు తిట్టాడు.

ఇంకా చదవండి ...

పాఠశాలలో విద్యార్థులకు విద్యా, బుధ్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే దారితప్పాడు. తన పాఠశాలలోని బాలిక పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. బాలికను అందరి ముందే  నోటికొచ్చినట్లు నానా దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా ఆమెను కులంపేరుతో తిట్టి, విచక్షణ రహితంగా కొడుతు దురుసుగా ప్రవర్తించాడు. దళితులు, వెనుక బడిన వర్గాలను అభివృద్ధి చేయడానికి, వారిపట్ల వివక్షతను రూపు మాపడానికి ప్రభుత్వాలు..  ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కొందరు తీరు మాత్రం మారడం లేదు.

ఇప్పటికి అనేక చోట్ల దళితులు వివక్షతకు గురౌతునే ఉన్నారు. కొన్ని చోట్ల వారిని పాఠశాలలో చదివేందుకు అనుమతి ఇవ్వట్లేదు. మరికొన్ని చోట్ల దళితులు దేవాలయ ప్రవేశానికి ప్రత్యేకమైన ఆంక్షలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని అవగాహాన కార్యక్రమాలు చేపట్టిన, పథకాలు తీసుకొచ్చిన దళితులపై పూర్తి స్థాయిలో వివక్షత మాత్రం పొవట్లేదు. తాజాగా,  ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh)  అమానుషమైన ఘటన చోటు చేసుకుంది. మహోబా జిల్లాలోని ఒక పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నమాండ్వి అనే బాలికకు దాహం వేసింది. ఆమె ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా పెట్టిన కుండ నుంచి నీరు తాగింది. దీంతో అక్కడి ఉపాధ్యాయుడు కళ్యాణ్ సింగ్ బాలిక పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఆమెను నోటికొచ్చినట్లున కులం పేరుతో తిట్టి, ఆ తర్వాత కొట్టాడు. బాలిక మాండ్వి ఏడుస్తూ.. తన ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తన తండ్రి రమేష్ కుమార్ కు చెప్పింది. వెంటనే అతను పలువురు గ్రామస్థులతో కలిసి స్కూల్ కు చేరుకున్నారు. ఉపాధ్యాయుడి నిర్వాకం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తమ కూతురిని కులంపేరుతో దూశిస్తూ... కొట్టిన ఉపాధ్యాయుడి పట్ల చర్యలు తీసుకొవాలని బాధిత బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఘటనపై విద్యాశాఖ సీరియస్ అయ్యింది. పాఠాశాలలో విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడి అంటరాని తనం చూపించడాన్ని విద్యాశాఖ తీవ్రంగా పరిగణించింది. ఘటనపై విచారణ చేపట్టి ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకొవాలని అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

First published:

Tags: Harassment, School girl, Uttar pradesh

ఉత్తమ కథలు