హోమ్ /వార్తలు /క్రైమ్ /

బాలికపై అమానుషం.. ప్రైవేటు భాగాల్లో కాగుతున్న వేడి నూనె పోసిన తల్లి.. కారణం ఏంటంటే..

బాలికపై అమానుషం.. ప్రైవేటు భాగాల్లో కాగుతున్న వేడి నూనె పోసిన తల్లి.. కారణం ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uttar pradesh: బాలికను కొన్ని రోజులుగా తల్లిదండ్రులు మానసికంగా వేధిస్తున్నారు. తండ్రి కూడా ఆమెను లైంగికంగా వేధించేవాడు. ఈ క్రమంలో మరీ దారుణంగా బాలిక ప్రైవేటు భాగాల్లో నూనె పోశారు.

కొంత మంది తల్లిదండ్రులు పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంటారు. పిల్లలను కొట్టడం, దాడులు చేయడం చేస్తుంటారు. పిల్లలను కర్రలతో కొట్టడం, గాయపర్చడం కూడా చేస్తుంటారు. ఇక.. కొందరికి పిల్లలు లేక పోవడంతో ఇతరుల పిల్లలను దత్తత తీసుకుంటారు. ఈ క్రమంలో కొంత మంది తమ పిల్లలను బాగా చూసుకుంటారు. మరికొందరు మాత్రం.. పిల్లలను చిత్రహింసలకు గురిచేస్తుంటారు. తమ పిల్లలు కాదు.. కాబట్టి వారి పట్ల ఇష్టమోచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. కొంత మంది ప్రైవేటు భాగాల్లో కారం చల్లడం, వాతలు పెట్టడం చేస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో  (Uttar pradesh) దారుణమైన ఘటన జరిగింది. లక్నోలో జరిగిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. స్థానికంగా ఉన్న ఠాకూర్ గంజ్ లోని 35 ఏళ్ల పూనమ్ కు పిల్లలు లేరు. దీంతో వీరు.. అజయ్ కుమార్ కూతురును ఆరునెలల క్రితం దత్తత తీసుకున్నారు. అయితే, వీరు మనస్పూర్తిగా బాలికను ఇష్టంతో దత్తత తీసుకొలేదు. బాలిక ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆమెను వేధించేవారు. ఆమె మారు తండ్రి లైంగికంగా కూడా హింసించేవాడు.

ఈక్రమంలో.. బాలిక దత్తత తల్లి ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించింది. కిచెన్ లోని సల సల కాగుతున్న వేడి నూనెను బాలిక ప్రైవేటు భాగాల్లో పోసింది. దీంతో బాలిక.. తన కన్న తండ్రికి జరిగిన దారుణాన్ని తెలిపింది. దీంతో బాలికను వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. బాలికకు చికిత్స అందిస్తున్నారు. బాలిక కన్న తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పూనమ్ ను అరెస్టు చేశారు. విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా ఒక యువతి ఇద్దరితో ఎఫైర్ నడిపి చివరకు విగత జీవిగా మారింది.

ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) దారుణమైన ఘటన జరిగింది. రాయ్‌పూర్ నగరంలో సంభవించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. దుర్గ్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల యువకుడు.. అదే గ్రామానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. ఇద్దరు కొన్నేళ్ల పాటు కలసి తిరిగారు. అయితే.. కొన్ని రోజుల క్రితం.. యువకుడికి, తన ప్రియురాలు మరో యువకుడితో కూడా ఎఫైర్ నడిపిస్తుందని తెలిసింది. దీంతో ఒక్కసారిగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

తన ప్రాణానికన్నా.. ఎక్కువగా ప్రేమించిన యువతి తనను మోసం చేయడాన్ని తట్టుకొలేక పోయాడు. వెంటనే కోపంతో యువతి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఎవరు లేనిది చూసి, ఆమెతో వాగ్వాదానికి దిగాడు. కోపంలో ఆమెను కత్తితో పొడిచాడు. ఆ తర్వాత.. తన ప్రియురాలిని వదిలి ఉండలేక అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం జరిగినట్లు తెలుస్తోంది. కాసేపటికి ఇంటికి వచ్చిన వారు.. ఇంట్లో తమ కూతురు, మరో వ్యక్తి మృతదేహాలను చూసి షాక్ కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీరి మృతదేహాలను పోస్ట్ మార్టం కు తరలించారు. ఘటనపై ఇద్దరు ప్రేమికుల కుటుంబాలను అదుపులోనికి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

First published:

Tags: Crime news, Uttar pradesh

ఉత్తమ కథలు