Home /News /crime /

UTTAR PRADESH KANPUR WOMAN SUB INSPECTOR HOME GUARD ARRESTED FOR TRYING TO EXTORT MONEY FROM TRADERS BY THREATENING THEM PAH

OMG: చీ ఛీ.. హోంగార్డుతో కలిసి లేడీ ఎస్సై పాడుపని.. వాళ్లని కూడ వదల్లేదు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uttar pradesh: లేడీ సబ్ ఇన్స్ పెక్టర్ ఆడతనానికే మాయని మచ్చను తీసుకొచ్చింది. హోంగార్డుతో కలిసి బరితెగించింది. డిపార్ట్ మెంట్ కు చెడ్డపేరు తీసుకొచ్చింది.

కొందరు పోలీసులు దారుణాలకు పాల్పడుతున్నారు. తమ అధికారాలను అడ్డం పెట్టుకుని ఇతరులను బెదిరించడం, తమ పనులకు వాడుకోవడం చేస్తుంటారు. కొందరు అధికారులు.. మహిళలను కూడా వేధిస్తున్నారు. పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రజలను కాపాడాల్సిన ఖాకీలే.. కీచకులుగా మారుతున్నారు. కొంత మంది ఇంటి పనులు చేయడం వలన డిపార్ట్ మెంట్ అంతటికి చెడ్డ పేరు వస్తుంది. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) పోలీసులు నీచంగా ప్రవర్తించారు. పోలీసులకే చెడ్డపేరు తీసుకొచ్చారు. కాన్పూర్ లోని ఒక లాడ్జీలో పోలీసులకు అసాంఘీక కార్యకలాపాలు చేస్తున్నారని సమాచారం అందిందిం. దీంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే హోటల్ లో సిబ్బందితో కలిసి రైడ్ చేశారు. ఒక గదిలో వ్యభిచారం నడుపుతున్నట్లు గుర్తించారు.



ఇద్దరు వ్యాపారులను పట్టుకున్నారు. వారిని మహిళ ఎస్సై , (Woman subinspector)  హోంగార్డుతో కలసి అడిగినంతా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అప్పుడు వదులుతామని తెలిపింది. డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిలింగ్ కు గురిచేసింది.  ప్రత్యేక ప్రదేశంలో బంధించారు. ఈ క్రమంలో.. బాధితులు తప్పించుకున్నారు. ఆ తర్వాత.. ఎస్పీని కలిసి జరిగిన విషయం తెలిపారు. దీంతో అధికారులు సీరియస్ అయ్యారు. వ్యాపారులు.. జలౌన్ కు చెందిన వారిగా సమాచారం. ఉన్నతాధికారులు.. లేడీ ఎస్సైను, హోంగార్డును అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా కర్ణాటకలో ఒక బ్యాంకు మేనెజర్ యువతి హనీ ట్రాప్ వలలో పడ్డాడు.

ఇండియన్ బ్యాంక్ లో ఆడిట్ కు వచ్చిన అధికారులు డబ్బులు నిల్వలు తక్కువగా ఉండటంతో ఆరా తీయగా ఘటన వెలుగులోనికి వచ్చింది. బెంగళూరులోని హనుమంతనగర్‌లో ఉన్న ఇండియన్ బ్యాంక్ మేనెజర్ హరిశంకర్, డేటింగ్ యాప్ లో యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త కాల్స్.. వరకు వెళ్లింది. హరిశంకర్ ఆమె బుట్టలో పడిపోయాడు. ఈ క్రమంలో.. తన ప్రియురాలి కోసం కస్టమర్ లు బ్యాంక్ లో పెట్టిన సోమ్మును ఆమె చెప్పిన అకౌంట్ లకు ట్రాన్స్ ఫర్ చేశాడు.

అతగాడు.. ఏకంగా .5.7 కోట్లను యువతి చెప్పిన అకౌంట్ లకు మళ్లించాడు. కాగా, మే 13 నుంచి 19 మధ్య ఈ లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు వెస్ట్ బెంగాల్ లో 28 ఖాతాలకు, కర్ణాటకలోని 2 ఖాతాలకు.. మొత్తం 136 లావాదేవీల్లో డబ్బులను ట్రాన్స్ ఫర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అంతే కాకుండా అతని పర్సనల్ డబ్బులు.. 12.5 లక్షలను కూడా ట్రాన్స్ ఫర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు హరిశంకర్ ను అరెస్టు చేశారు. అనేక కోణాల్లో అధికారులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Harassment, Police, Uttar pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు