హోమ్ /వార్తలు /క్రైమ్ /

హస్టల్ సిబ్బంది ఘనకార్యం.. విద్యార్థినులు స్నానం చేస్తుండగా వీడియో రికార్డు.. ఆందోళన చేపట్టిన విద్యార్థినులు..

హస్టల్ సిబ్బంది ఘనకార్యం.. విద్యార్థినులు స్నానం చేస్తుండగా వీడియో రికార్డు.. ఆందోళన చేపట్టిన విద్యార్థినులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uttar Pradesh: హస్టల్ లో విద్యార్థినులు స్నానం చేస్తుండగా సిబ్బంది వీడియో తీశారు. ఈ వీడియో బయటపడటంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోనికి వచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India

ఉత్తర ప్రదేశ్ లోని (Uttar Pradesh) కాన్పూర్ లో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కాన్పూర్ లో ఉన్న బాలికల హస్టల్ లో ఒక యువతి స్నానం చేస్తుండగా ఎవరో వీడియో తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా మారింది. యువతి వరకు వెళ్లింది. దీంతో దీనిపై హస్టల్ విద్యార్థినులంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. దీనిపై పోలీసులు సరిగ్గా స్పందించలేదని విద్యార్థినులంతా పోలీసు స్టేషన్ కు వెళ్లి ఆందోళన చేపట్టారు.

వెంటనే నిందితులను అరెస్టు చేసి కఠినంగా పనిష్మెంట్ చేయాలని నిరసన చేపట్టారు. ఈ ఘటన సాయి నివాస్ బాలికల హస్టల్ లో జరిగిందని తెలుస్తోంది. కాగా, ఈ సంఘటన కేవలం వారం క్రితం చండీగఢ్ యూనివర్శిటీ బాత్రూమ్ లో వీడియో తీసి బాయ్ ఫ్రెండ్ కు పంపిన యువతి.. వివాదం జరిగిన కొన్ని రోజుల్లోనే సంభవించింది. బాలికల హాస్టల్ నుండి వీడియో లీక్ అయినప్పుడు, విద్యార్థుల భారీ నిరసనలకు దారితీసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా తమిళనాడులో (Tamil nadu) దారుణ ఘటన జరిగింది.

చెన్నైలో తన స్నేహితురాలితో కలిసి హోటల్ కు వెళ్లిన యువతి తిరిగి రావడానికి ఉబర్ ఆటోను బుక్ చేసుకుంది. అప్పటికే రాత్రి 10 అయ్యింది. ఈ క్రమంలో ఆటో దిగుతుండగా ఆటో డ్రైవర్ నీచంగా ప్రవర్తించాడు. ఈ ఘటనను విద్యార్థిని ట్విటర్ లో పోస్ట్ చేసి తన బాధను చెప్పుకుంది. దీంతో నెటిజన్లు ఘటనపై తమ నిరసనలు తెలియజేస్తున్నారు.

పోలీసుల ప్రకారం.. చెన్నైలో (Chennai)  ఇషితా సింగ్ అనే డిగ్రీ యువతి స్థానికంగా ఉన్నసిటీ హోటల్ కు వెళ్లింది. తిరిగి ఇంటికి రావడానికి ఉబర్ లో ఆటోను బుక్ చేసుకుంది. అప్పటికే రాత్రి 10 అయ్యింది. ఆమె స్నేహితురాలు ఆటో దిగుతుండగా ఆటో డ్రైవర్ , బాలిక రొమ్మును తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె వెంటనే గట్టిగా అరవడంతో అతను పారిపోయాడు. వెంటనే యువతి.. స్థానికంగా ఉన్న లేడీ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అక్కడ మహిళా పోలీసులు ఎవరు లేరు.

దీంతో ఎఫైఐఆర్ నమోదు చేయలేదు. అక్కడ రాత్రిపూట అని.. స్టేషన్ లోపలికి వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదని యువతి వాపోయింది. ఈ క్రమంలో ఆటోరిక్షా ఫోటోలను ట్విటర్ లో పోస్టు చేసింది. సెల్వం అనే ఉబర్ డ్రైవర్ తన కుడి రొమ్మును నొక్కి అసహ్యంగా ప్రవర్తించాడని తన బాధను ట్విటర్ లో పోస్ట్ చేసింది.  ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. యువతి పోలీసు కమిషనర్ కు ట్యాగ్ చేసింది. వెంటనే అధికారులు దీనిపై రిప్లై ఇచ్చారు. కేసు నమోదు చేశామని, వెంటనే నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Harassment on women, Uttar pradesh

ఉత్తమ కథలు