Home /News /crime /

UTTAR PRADESH JILTED LOVER HACKS GIRL TO DEATH FOR REJECTING MARRIAGE PROPOSAL PAH

కొంత కాలంగా ఇద్దరి మధ్య ఎఫైర్.. అమ్మాయికి మరో సంబంధం చూస్తున్నారని తెలిసి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uttar pradesh: ఇంటి పక్కన ఉండే వ్యక్తితో యువతి ప్రేమలో పడింది. ఇద్దరు కలిసి రహస్యంగా కలుసుకునే వారు. ఈ క్రమంలో.. వీరి వ్యవహారం కాస్త అమ్మాయి ఇంట్లో తెలిసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India
సాధారణంగా చాలా మంది యువత ఈ మధ్య కాలంలో ప్రేమ పెళ్లిళ్లు చేసుకొవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తొలుత స్నేహంగా ఉండి, ఇరువురి ఆలోచనలు ఒక్కటిగా మారి ఆ తర్వాత.. అది కాస్త ప్రేమకు దారితీస్తుంది. మరికొందరు మాత్రం పవిత్రమైన ప్రేమను అడ్డమైన అవసరాల కోసం వాడుకుంటున్నారు. మొదట ప్రేమిస్తున్నట్లు నటించి, ఆ తర్వాత.. తమకు కావాల్సినవి దొరకగానే మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మోసాలు చేయడంలో అబ్బాయిలు, అమ్మాయిలు కూడా ఉంటున్నారు. ఒకరికి తెలియకుండా, మరోకరితో ప్రేమాయణాలు నడిపిస్తుంటారు. కొన్నిసార్లు ప్రేమించిన వారు, పెళ్లికి నిరాకరిస్తే.. గొడవలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో హత్యలు చేయడానికి సైతం వెనుకాడరు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)  షాకింగ్ ఘటన జరిగింది. లఖింపూర్ ఖేరీ: ఉత్తరప్రదేశ్‌లోని భాసోరి గ్రామంలో ఓ యువతిని ఆమె పొరుగింటి యువకుడు కొడవలితో నరికి చంపాడు. యువకుడి పెళ్లి ప్రతిపాదనను యువతి తిరస్కరించినట్లు సమాచారం. పోలీసుల ప్రకారం.. సీమా అనే యువతి, ఆమె పొరుగింట్లో ఉండే రాజేష్ కుమార్ అలియాస్ ఛోటూ కొన్నిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే.. రాజేష్ కు ఉద్యోగం లేకపోవడం వలన, యువతిని అతడికి ఇచ్చి పెళ్లి చేయడానికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో అతను యువతిపై కోపం పెంచుకున్నాడు. ఆమెకు మరోక సంబంధాలు చూస్తున్నారని తెలిసి కోపంతో రగిలిపోయాడు.వెంటనే.. సీమా ఇంటికి అర్దరాత్రి వెళ్లాడు. ఆమె మంచి నిద్రలో ఉండగా కత్తితో దాడిచేశాడు. పలుమార్లు ఆమె మెడపై పొడిచాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో విగత జీవిగా మారిపోయింది. ఆ తర్వాత.. నిందితుడు పారిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయింది. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా తన కోడలి తలను అత్తనరికి ఏకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లింది.

వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని అన్నమయ్య జిల్లా (Annamayya District) రాయచోటి మండలంలో నివాసం ఉంటుంది సుబమ్మ. ఈమె కోడలు వసుంధరతో కలసి కొత్తపేట రామాపురంలో ఉంటోంది. కొడుకు ఉన్నంత కాలం కోడలితో అత్త బాగానే మెలిగేది. కొన్ని తగాదాలు కొని తెచ్చుకున్న కొడుకు కొన్నేళ్లక్రిందట శ్రీకాళహస్తి పట్టణంలో హత్యకు గురైయ్యాడు. దీంతో అత్తాకోడళ్లిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. భర్త పోయిన నాటి నుంచి అత్తాకోడళ్ల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతున్నాయి.

మరోవైపు యుక్తవయసులో ఉండటం.. భర్త లేకపోవడంతో కోడలు వసుంధర మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న అత్త తరచూ కోడలితో గొడవకు దిగేది. కుటుంబానికి చెందిన కొంతపొలంతో పాటు ఇల్లు, ఇతర ఆస్తులు అత్త సుబ్బమ్మ పేరిట ఉన్నాయి. దీంతో ఆస్తిలో తనకు వాటా కావాలని అత్తతో గొడవపడుతుండేది వసుంధర.

ఈ క్రమంలో ఇవాళ ఉదయం నుంచి గొడవ తారాస్థాయికి చేరుకుంది. దీంతో సుబ్బమ్మ తన అన్న కొడుకుతో మాట్లాడుతుండగా.. కోడలు వసుంధర తన ప్రియుడిని, మరిదిని వెంటబెట్టుకొని వచ్చింది. అక్కడితో ఆగకుండా అత్తతో గొడవకు దిగింది. ఇద్దరూ కాసేపు జుట్టుజుట్టు పట్టుకొని గొడవపడ్డారు. అదే సమయంలో కోడలు వసుంధర ఎక్కడ చంపేస్తుందో అని భయపడిన సుబ్బమ్మ.. తన అన్న కొడుకుతో కలసి కత్తితో కోడలి తల నరికేసింది. అంతేకాదు మొండెం నుంచి తలను వేరు చేసి తలను తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Uttar pradesh

తదుపరి వార్తలు