భార్యను ‘చంపిన’ ఐఏఎస్ ఆఫీసర్‌పై కేసు..

సెప్టెంబర్ 1న అనిత సింగ్ లైసెన్స్ రివాల్వర్‌తో కాల్చుకుందంటూ ఉమేష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

news18-telugu
Updated: September 6, 2019, 5:25 PM IST
భార్యను ‘చంపిన’ ఐఏఎస్ ఆఫీసర్‌పై కేసు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఐఏఎస్ అధికారి మీద పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పట్టణాభివృద్ది సంస్థ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఉమేష్ కుమార్ మీద పోలీసులు ఐపీసీ సెక్షన్ 302, సెక్షన్ 201 (సాక్ష్యాలు మాయం చేయడం) వంటి కేసులు నమోదయ్యాయి. ఉమేష్ కుమార్ భార్య అనిత సింగ్ ఈనెల 1న చనిపోయారు. బుల్లెట్ గాయాలు కావడంతో ఆమె చనిపోయారు. అయితే, కొన్ని రోజులుగా భర్త ఉమేష్ కుమార్‌తో ఆమెకు గొడవలు జరుగుతున్నాయని అనిత సింగ్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘ఉమేష్ కుమార్‌కు వేరొకరితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంపై కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కానీ, మా అక్కను బావ (ఉమేష్ కుమార్) కొట్టేవాడు. ఏదైనా జరగరానిది జరగొచ్చని మా అక్క కూడా మాకు చెబుతూ ఉండేది.’ అని అనిత సింగ్ సోదరుడు రాజీవ్ సింగ్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

సెప్టెంబర్ 1న అనిత సింగ్ లైసెన్స్ రివాల్వర్‌తో కాల్చుకుందంటూ ఉమేష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను, కుమారుడు, పనిమనిషి కలసి ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. అక్కడి నుంచి కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆ తర్వాత తమకు సమాచారం అందిందని అనిత సింగ్ సోదరుడు రాజీవ్ సింగ్ తెలిపాడు. తాము పోస్టుమార్టం వద్దకు వెళ్లామని చెప్పాడు. దీని వెనుక ఏదో అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నాడు.

First published: September 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>