హోమ్ /వార్తలు /క్రైమ్ /

యువతి పై కన్నేసిన జిమ్ ట్రైనర్.. మార్కెట్ లో అందరి ముందే బలవంతంగా..

యువతి పై కన్నేసిన జిమ్ ట్రైనర్.. మార్కెట్ లో అందరి ముందే బలవంతంగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uttar pradesh: యువతి ప్రతిరోజు జిమ్ కు వెళ్లేది. అక్కడ వర్కవుట్స్ చేసేది. అక్కడ ఒక.. ట్రైనర్ ఆమెకు జిమ్ వర్కవుట్స్ చెప్పేవాడు. అతగాడు ఆమెపై కన్నేశాడు.

కామాంధులు మహిళ కన్పిస్తే చాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. పసిపాప నుంచి పండు ముసలి వరకు ఏ ఒక్కరిని వదలడం లేదు. గుడి, బడి, బస్టాండ్, రైల్వే స్టేషన్ ఎక్కడ కూడా మహిళకు సెఫ్టీ లేకుండా పోయింది. కొన్ని చోట్ల పోలీసులు కూడా మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కొంత మంది ఇంట్లో వారు కూడా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తమకు ఇష్టం లేదన్నా వినడం లేదు. తమ కోరిక తీర్చాలంటూ మహిళలపై ఎంతటి నీచానికైన దిగజారుతున్నారు. ఈ కోవకు చెందిన ఘటన వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) దారుణమైన ఘటన జరిగింది. గోండాలోని నవాబ్ గంజ్ లో జరిగిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. స్థానికంగా ఉండే 22ఏళ్ల యువతి ప్రైవేటు స్కూల్ లో టీచర్ గా చేస్తుంది. ఆమె హెల్త్ కోసం.. జిమ్ కు వెళ్తుండేది. అక్కడ జిమ్ ట్రైనర్ (Gym trainer)  ఆమెకు వర్కవుట్స్ నేర్పించేవాడు. ఈ క్రమంలో అతగాడి కన్ను ఆమెపై పడింది. ఆమెను లైంగికంగా తన కోరిక తీర్చాలంటూ వేధించేవాడు. ఆమెను ఫాలో అయ్యేవాడు.

దీంతో ఆమె అతడిని అవాయిడ్ చేసింది. అప్పుడు.. యువతి మార్కెట్ కు వెళ్లినప్పుడు కాపుకాచి ఉన్నాడు. ఆమె వెళ్తుండగా.. సుమో తీసుకొని ఆమె ముందు ఆపాడు. వెంటనే ఆమెను బలవంతంగా సుమోలో ఎక్కించుకున్నాడు. దీంతో అక్కడ ఉన్న వారు షాకింగ్ కు గురయ్యారు. ఆమెను కాపాడటానికి ప్రయత్నించారు. కానీ అతను స్పీడ్ గా వెళ్లిపోయాడు. వెంటనే ఇంట్లో వారికి సమాచారం ఇచ్చారు. దీనిపై.. బాధిత యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఒక భర్త.. భార్యపై దారుణానికి పాల్పడ్డాడు.

పాకిస్థాన్ (Pakistan) లోని సింధ్ ప్రాంతంలో దారుణమైన ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న.. గుల్షన్-ఎ-ఇక్బాల్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లోని వంటగదిలో జ్యోతిలో నర్గీస్ అనే మహిళ మృతదేహాన్ని బుధవారం పోలీసులు కనుగొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బజౌర్ ఏజెన్సీకి చెందిన మహిళ భర్త ఆషిక్.. పాఠశాలలో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ ఎనిమిది నుంచి తొమ్మిది నెలలుగా మూతపడిన పాఠశాలలోని సర్వెంట్ క్వార్టర్‌లో నివసిస్తున్నాడు. అతనికి ముగ్గురు ఆడపిల్లలు. అయితే, అతను తన భార్యను పరాయి మగాళ్లతో వివాహేతర సంబంధం పెట్టుకొవాలంటూ బలవంతం చేసేవాడు. దీనికి అతని భార్య.. జ్యోతిలో నర్గీస్ ఒప్పుకునేదికాదు. దీంతో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవి.

ఈ క్రమంలో గత బుధవారం.. ముగ్గురు ఆడపిల్లల ముందే భార్య కాళ్ల చేతులు కట్టేసి.. కడాయిలో ఉడికించాడు. మరుగుతున్న నీళ్లలో భార్యను ముంచాడు. వేడికి తాళలేక.. ఆమె అక్కడే మరణించింది. ఈ దారుణ ఘటన తర్వాత ఆషిక్ తన ముగ్గురు పిల్లలతో కలిసి వేరే ప్రాంతానికి పారిపోయాడు. అయితే.. బాధితురాలి 15 ఏళ్ల కుమార్తె పోలీసులకు ఫోన్ చేసి జరిగిన దారుణాన్ని తెలిపింది.

First published:

Tags: Crime news, Harassment, Uttar pradesh

ఉత్తమ కథలు