• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • UTTAR PRADESH GIRL KILLS BROTHER AFTER HE ATTEMPTS TO MOLEST HER SK

చెల్లిపై అన్న అత్యాచారయత్నం.. రోకలితో కొట్టి.. కొడవలితో నరికి చంపేసింది..

చెల్లిపై అన్న అత్యాచారయత్నం.. రోకలితో కొట్టి.. కొడవలితో నరికి చంపేసింది..

ప్రతీకాత్మక చిత్రం

అన్నా.. వదలిపెట్టమని ప్రాధేయపడినా వినలేదు. పశువులా ఆమె మీద పడబోయాడు. దిక్కుతోచని స్థితిలో ఇంట్లో ఉన్న రోకలితో అన్నపై దాడి చేసింది చెల్లి. అతడు కిందపడడంతో అక్కడే ఉన్న కొడవలి తీసుకొని నరికింది.

  • Share this:
    చెల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అన్న.. దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తోడబుట్టిన చెల్లిపైనే అత్యాచారానికి యత్నించాడు. ఆ కామాంధుడి నుంచి తప్పించుకునేందుకు కొడవలితో దాడిచేసి.. అన్నను చంపేసింది చెల్లి. ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా జిల్లాలోని కొత్వాలి పోలిస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘోరం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దీపక్ అనే 20 ఏళ్ల యువకుడు కంప్యూటర్ కోర్సు చదువుతున్నాడు. అతడికి 18 ఏళ్ల వయసున్న చెల్లి ఉంది. తల్లిదండ్రులు అమ్మమ్మ ఇంటికి వెళ్లడంలో అన్నాచెల్లెల్లు ఇద్దరే ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఏ సోదరుడూ చేయకూడని పనిచేశాడు దీపక్. తోడబుట్టిన చెల్లిపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు.

    అన్నా.. వదలిపెట్టమని ప్రాధేయపడినా వినలేదు. పశువులా ఆమె మీద పడబోయాడు. దిక్కుతోచని స్థితిలో ఇంట్లో ఉన్న రోకలితో అన్నపై దాడి చేసింది చెల్లి. అతడు కిందపడడంతో అక్కడే ఉన్న కొడవలి తీసుకొని నరికింది. తీవ్ర రక్తస్రరావం కావడంతో దీపక్ అక్కడికక్కడే చనిపోయాడు. ఘటన అనంతరం నేరుగా పోలిస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది ఆ యువతి. జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. దీపక్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎటావా జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: