హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: పింపుల్స్ తగ్గటం లేదని యువతి ఆత్మహత్య.. ఇంటిలో ఎవరులేనిది చూసి..

Shocking: పింపుల్స్ తగ్గటం లేదని యువతి ఆత్మహత్య.. ఇంటిలో ఎవరులేనిది చూసి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uttar Pradesh: యువతి తన ముఖం మీద మొటిమలు వచ్చాయని బాధపడింది. తగ్గడానికి ఎన్నోచికిత్సలు తీసుకుంది. అయినప్పటికి అవి తగ్గలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైంది.

కొంత మంది.. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి పెద్దగా చూస్తున్నారు. ఏవేవో ఆలోచించి కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. నూరేళ్ల జీవితాన్ని అర్ధంతరంగా ముగించేస్తున్నారు. మరికొందరు తమ ప్రేమ దక్కలేదని, ప్రేమించిన వారు అవాయిడ్ చేశారని ఆత్మహత్యకు (Suicide)  పాల్పడుతుంటారు. కొందరు కొత్త బట్టలు కొనివ్వలేదని, సెల్ ఫోన్ కొనివ్వడానికి నిరాకరించరని ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇంకొందరు.. తాము అందంగా లేమని, ముఖంపై మచ్చలు ఉన్నాయని మరికొందరు కుమిలిపోతుంటారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో  (Uttar pradesh) దారుణం జరిగింది. బిసంద పోలీస్ స్టేషన్ పరిధిలోని అజిత్ పారా గ్రామంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఒక యువతికి మోహం మీద పింపుల్స్  (Pimples)  వచ్చాయి. ఎన్ని చికిత్సలు చేయించుకున్న అవి తగ్గలేదు. ఆమెకు పింపుల్స్ కారణంగా, ఆమెతో స్నేహం చేయడానికి ఇష్టపడేవారు కాదు. ఆమె అందంగా లేదని, ముఖంపై పింపుల్స్ ఉన్నాయని పెళ్లి చూపులకు వచ్చిన వారు ఆమెను రిజక్ట్ చేశారు.

దీంతో యువతి మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైంది. సోమవారం తన ఇంట్లో పశువులకు దానా పెట్టి ఆమె తన గదిలోకి వెళ్లింది. ఇంటిలో ఎవరు లేనిది చూసి ఆత్మహత్యకు పాల్పడింది. యువతి ఎంత సేపటికి డోర్ తీయకపోవడంతో కుటుంబ సభ్యులు కిటికి నుంచి చూశారు. అప్పుడు ఆమె ఉరికి వేలాడుతూ విగత జీవిగా కన్పించింది. వెంటనే డోర్ పగలగొట్టి ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా పెళ్లికి కొంత సేపటి ముందే వరుడు ఎస్కేప్ అయిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.

మధ్య ప్రదేశ్ లోని (Madhya pradesh)  భోపాల్ లో (Bhopal)  వింతఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. బెతుల్ ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ (Constable) సోను చల్తియాకు మే 22న ఒక యువతితో పెళ్లి నిశ్చయమైంది. పెళ్ళి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వధువు తరపు వారు అరెంజ్ మెంట్స్ అంతా గ్రాండ్ గా చేశారు. అయితే, వరుడు (Groom escape) తరపు వారు ఎంత సేపటికి పెళ్లి మండపానికి రావడం లేదు. దీంతో కంగారు పడిపోయిన వధువు తరపువారు.. పలుమార్లు ఫోన్ చేశారు. అప్పుడు తమ కొడుకు కన్పించడం లేదని చెప్పారు.

దీంతో అమ్మాయి కుటుంబం వారు షాక్ కు గురయ్యారు. వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులకు కానిస్టేబుల్ సోను గురించి సంచలన విషయాలు బయటపెట్టారు. సోను ఏడాది నుంచి మరో యువతితో ఎఫైర్ లో (love affair) ఉన్నాడని తెలిపారు. దీంతో యువతి షాక్ నకు గురైంది. అయితే, కానిస్టేబుల్ తీరుపట్ల యువతి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి అరెంజ్ మెంట్స్ చేస్తున్నామని ఇప్పుడు మోసం చేయడం న్యాయమేనా అని అధికారులను ప్రశ్నించారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసు మోసం,చేయడం ఎంత వరకు కరెక్టు అని అధికారుల ఎదుట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులకు.. కానిస్టేబుల్ సోను పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

First published:

Tags: Crime news, Uttar pradesh, Woman suicide

ఉత్తమ కథలు