Home /News /crime /

UTTAR PRADESH DERA BASSI MAN BEATEN TO DEATH OVER DAUGHTERS MATRIMONIAL DISPUTE PAH

OMG: కొంప ముంచిన పెళ్లి పంచాయతీ.. మంచి మాటలు చెప్దామని వెళితే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uttar Pradesh: పెళ్లి చేసుకున్న కొత్త దంపతుల మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఇరువురు తమ మధ్య ఉన్న గొడవలను పెద్దల వరకు తీసుకెళ్లారు.

వివాహం అయ్యాక కొంత మంది ఎంతో సరదాగా ఉంటారు. ఒకర్నిమరోకరు అర్థం చేసుకుంటారు. పరస్పరం ప్రేమాభిమానాలు కల్గి ఉంటారు. ఒకరికి మరోకరు గౌరవం ఇచ్చుకుని, సమాజంలో మంచి పేరును సంపాదిస్తుంటారు. అయితే.. మరికొందరు దీనికి పూర్తిగా భిన్నంగా చీటికి మాటికి గొడవలకు (Family disputes)  దిగుతుంటారు. మూడు ముళ్ల బంధానికి, ముళ్లుగా మారతారు. ఒకరిపై మరోకరు ఏమాత్రం ప్రేమగా నడుచుకోరు. దీంతో ఇద్దరు ఎప్పుడు తగవులాడుకుంటూ.. అందరి ముందు నవ్వుల పాలవుతారు. కొన్నిసార్లు.. ఈ గోడవలు, భౌతిక దాడులు, హత్యల వరకు కూడా వెళ్తుంటుంది. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లోని (Uttar pradesh)  ముబారక్ పూర్ లో దారుణ ఘటన జరిగింది. మంగల్ అనే వ్యక్తికి ఒక కూతురు ఉంది. ఆమెకు ఇప్పటికే మొదటి వివాహం జరిగి.. భర్తతో బేధాభిప్రాయాలు రావడంతో ఆమె విడిపోయింది. ఈ క్రమంలో ఆమెకు రెండో వివాహం జరిగింది. కొద్ది రోజులకు భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. ఇరుకుటుంబాలు సర్దిచెప్పడానికి ప్రయత్నించారు.



తనను.. అత్త, ఆడబిడ్డలు వేధిస్తున్నారని, బాధితురాలు తెలిపింది. దీంతో బాల్కర్ అనే వ్యక్తిని మధ్య వర్తిత్వం కొరకు పిలిచారు. అయితే.. దీంతో వీరిమధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో.. బాల్కర్ మంగళ్ పై దాడిచేశాడు. దీంతో అతను అపస్మారక స్థితిలోనికి వెళ్లిపోయాడు. దీంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మంగళ్ భార్య.. రాధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా కన్నతల్లి కసాయిగా ప్రవర్తించింది.

పూర్తి వివరాలు.. కర్ణాటకలో (Karnataka)  దారుణ ఘటన జరిగింది. బెంగళూరులోని ఎస్ఆర్ నగర్ లో ఉన్న ఒక ఇంట్లో దారుణ ఘటన జరిగింది. ఒక మహిళ నాలుగో అంతస్థులో బాల్కనీలో నిలబడీ తన కూతురుని కిందకు విసిరేసింది. దీంతో చిన్నారి తలపగలి అక్కడే చనిపోయింది.  ఈ క్రమంలో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల ప్రకారం.. నాలుగేళ్ల బాలికకు మాటలు రావని, వినబడదని అందుకే తల్లి ఇలా చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా బాలిక తల్లి, సాఫ్ట్ వేర్ ఇంజినీర్, తల్లి డెంటల్ డాక్టర్. అయితే.. తల్లి మానసిక ప్రవర్తనపై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో మహిళ కొన్నిరోజులుగా తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం తల్లి కింద విసిరేసిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ క్లిప్పింగ్స్ వైరల్ గా (viral news) మారాయి.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Uttar pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు