భర్త చనిపోవడంతో అతడి ఫ్రెండ్‌తో వివాహేతర సంబంధం.. ఆమె చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ప్రతీకాత్మక చిత్రం

సంజీవ్ చనిపోయిన తర్వాత షాలిని.. అతడి స్నేహితుడు విపిన్‌తో షాలిని వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన ప్లాన్ గురించి విపిన్‌కు చెప్పడంతో.. అతడు కూడా సరే అన్నాడు.

 • Share this:
  ఓ మహిళ.. భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి చేరింది. అయితే ఆమె మదిలో మెదిలిన ఓ ఆలోచన.. తీవ్ర పరిణామాలకు దారితీసింది. భర్త తండ్రి ఆస్తిపై కన్నేసిన ఆమె కిరాయి ముఠాతో అతడిని హత్య చేయించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని మవానా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసకుంది. ఇందుకు సంబంధిచిన కేసును చేధించిన పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. వివరాలు.. సత్‌పాల్ అనే వ్యక్తి రైతు కుమారుడు సంజీవ్‌కు షాలిని అనే మహిళతో వివాహం జరిగింది. 2014లో వీరి పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి ఒకరి వయసు 6, మరోకరిది వయసు 4. అయితే 2018లో సత్‌పాల్ మరణించాడు. దీంతో షాలిని.. బాగ్‌పట్‌లోని పాలి గ్రామంలోని తన పుట్టింటికి చేరింది.

  ఇక, భర్త చనిపోయిన తర్వాత ఆమె కన్ను అత్తారింటి ఆస్తిపై పడింది. ఇందుకోసం షాలినికి, సత్‌పాల్‌ మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే షాలిని సత్యపాల్‌ను చంపాలనే నిర్ణయం తీసుకుంది. సంజీవ్ చనిపోయిన తర్వాత షాలిని.. అతడి స్నేహితుడు విపిన్‌తో షాలిని వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన ప్లాన్ గురించి విపిన్‌కు చెప్పడంతో.. అతడు కూడా సరే అన్నాడు. ఇందుకు షాలిని తండ్రి భోపాల్ సింగ్, సోదరుడు లలిత్‌ కూడా సహకరించారు.

  దీంతో షాలిని.. మామ సత్‌పాల్‌ను హత్య చేసేందుకు కాంట్రాక్ట్ కిల్లర్లను సంప్రదించింది. వారితో డీల్ కుదుర్చుకుంది. ఇందుకోసం కొంత మొత్తం ముందుగానే వారికి చెల్లించింది. ఇక, ప్లాన్‌లో భాగంగా.. కొద్ది రోజులుగా విపిన్.. సత్‌పాల్‌పై రెక్కీ నిర్వహించాడు. అతడు ఏ సమయంలో ఎక్కడున్నాడనే విషయాలను కాంట్రాక్ట్ కిల్లర్స్‌కు చెరవేశాడు. ఇక, జూన్ 29 సత్‌పాల్ పొలం నుంచి తిరిగి వచ్చే సమయంలో.. కాంట్రాక్ట్ కిల్లర్స్ అతడిని కాల్చి చంపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.

  ఈ ఘటనపై సత్‌పాల్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు.. చివరకు షాలిని, ఆమె కుటుంబ సభ్యులను, విపిన్‌ను అరెస్ట్ చేశారు. అయితే సత్‌పాల్‌ను కాల్చి చంపిన నిందితులు మాత్రం ఇంకా పరారీలో ఉన్నట్టుగా పోలీసులు వెల్లడించారు. వారికి పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
  Published by:Sumanth Kanukula
  First published: