హోమ్ /వార్తలు /క్రైమ్ /

భర్త మృతి.. వితంతు పెన్షన్ కోసం దరఖాస్తు చేసేందుకు వెళ్తే ఓ కుర్రాడు పరిచయం.. చివరకు జరిగిందో ఘోరం..!

భర్త మృతి.. వితంతు పెన్షన్ కోసం దరఖాస్తు చేసేందుకు వెళ్తే ఓ కుర్రాడు పరిచయం.. చివరకు జరిగిందో ఘోరం..!

వేదమంత్రాల మధ్య తాళికట్టిన భర్తను అక్రమ సంబంధం మోజులో పడి హత్య చేయించింది..అది కూడా 

పట్టుమని పదహారేళ్లు కూడా లేని యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో భర్తను 

కడతేర్చేందుకు ప్లాన్ వేసింది..ఇందుకోసం తన నిందుతురాలి అక్కతోపాటు ప్రియుడు, అతని స్నేహితుడు 

కూడా సహకరించారు. (ప్రతీకాత్మక చిత్రం)

వేదమంత్రాల మధ్య తాళికట్టిన భర్తను అక్రమ సంబంధం మోజులో పడి హత్య చేయించింది..అది కూడా పట్టుమని పదహారేళ్లు కూడా లేని యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో భర్తను కడతేర్చేందుకు ప్లాన్ వేసింది..ఇందుకోసం తన నిందుతురాలి అక్కతోపాటు ప్రియుడు, అతని స్నేహితుడు కూడా సహకరించారు. (ప్రతీకాత్మక చిత్రం)

భర్త మరణించాడని వితంతు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆ మహిళ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లింది. అక్కడ ఆమెకు ఓ కుర్రాడు పరిచయం అయ్యాడు. అతడు చెప్పిన మాటలు నిజమని నమ్మి..

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. నిత్యం ఏదో ఒక చోట ఏదో ఒక రూపంలో ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. సొంత ఇంట్లోనే స్త్రీకి రక్షణ లేకుండా పోతోంది. అన్నలు, తమ్ముళ్లే కాకుండా కన్న తండ్రులే కామాంధులుగా మారుతున్న ఘటనలు కోకొల్లలు. పనిచేసే ఆఫీసుల్లో, చదువుకునే కాలేజీల్లో, స్కూళ్లల్లో కూడా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా జరిగిన ఓ ఘటన స్త్రీలు ఎలాంటి సమాజంలో బతుకుతున్నారన్నది తెలియజేస్తోంది. వితంతువులకు ప్రధానమంత్రి మోదీ రిలీఫ్ ఫండ్ ద్వారా అయిదు లక్షల రూపాయలు వచ్చేలా చేస్తామని నమ్మబలికారు. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని శమాబల్ జిల్లాలోని అస్మోలీ పోలీస్ స్టేషన్ పరిధిలో నఖాశా అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఓ మహిళకు కొద్ది కాలం క్రితం భర్త మరణించాడు. దీంతో వితంతు పెన్షన్ కోసం ఆమె దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలోనే స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో ఓ యువకుడు ఆమెతో మాటలు కలిపాడు. వితంతు పెన్షన్ గురించి అడిగేందుకు ఆమె వెళ్తే.. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రిలీఫ్ ఫండ్ కు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. వితంతువులు దరఖాస్తు చేసుకుంటే అయిదు లక్షల రూపాయలు ఇస్తారు. మీకు అయిదు లక్షలు వచ్చేట్టు మేం చేస్తాం.‘ అని నమ్మబలికాడు. ఈ క్రమంలోనే తన స్నేహితుడిని కూడా ఆమెకు పరిచయం చేశాడు. అయిదు లక్షలను ఆమెకు వచ్చేలా చేసేందుకు గానూ అయిదు వేల రూపాయలు లంచం ఇవ్వాలని కోరారు.

ఇది కూడా చదవండి: భర్త దారుణ హత్య.. పర్సు తీసుకొస్తానని పోలీసులకు చెప్పి ఇంట్లోకి వెళ్లిన భార్య.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూస్తే..

దానికి ఆమె తన వద్ద అంత లేవనీ, రెండు వేల రూపాయలు ఇచ్చుకుంటానంది. వాళ్లు సరేనన్నారు. పేపర్ వర్క్ అంటూ ఇప్పటికే రెండు వేల రూపాయలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే లాస్ట్ మీటింగ్ అంటూ ఆమెను కలవమన్నారు. తమ బైక్ పై ఎక్కించుకుని ఊరి చివర ఉన్న మామిడి తోటలోకి తీసుకెళ్లారు. ఆమెను బెదిరించి భయపెట్టి అత్యాచారం చేశారూ. ఒకరి తర్వాత మరొకరు పశువుల్లా తమ కామ వాంఛను తీర్చుకున్నారు. ఈ తతంగాన్ని వీడియో కూడా తీశారు. ఎవరికైనా చెబితే వీడియోను బయటపెడతామని బెదిరించారు. ఇలా కొద్ది నెలలుగా ఆమెపై అత్యాచారం చేస్తూనే ఉన్నారు. వారి ఆగడాలను భరించలేని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

ఇది కూడా చదవండి: ఓ ఇంటి ముందు టెంటు వేసి.. కుర్చీలో కూర్చుని కూలింగ్ వాటర్ తాగుతూ నిరసన.. ఇంతకీ అసలేం జరిగిందో తెలిస్తే అవాక్కవడం ఖాయం..!

First published:

Tags: Crime news, Crime story, CYBER CRIME, Husband kill wife, Wife kill husband

ఉత్తమ కథలు