Home /News /crime /

Husband and Wife: అతడు బిజినెస్‌మెన్.. ఆనందంగా సాగిపోతున్న జీవితం.. కానీ ఇలా ఊహించని విధంగా...

Husband and Wife: అతడు బిజినెస్‌మెన్.. ఆనందంగా సాగిపోతున్న జీవితం.. కానీ ఇలా ఊహించని విధంగా...

అమిత్, పింకీ

అమిత్, పింకీ

వారిది ఉన్నత కుటుంబం. సంపాదన కూడా బాగానే ఉంది. అయితే ఉన్నట్టుండి వారి కుటుంబలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.

  వారిది ఉన్నత కుటుంబం. సంపాదన కూడా బాగానే ఉంది. అయితే ఉన్నట్టుండి వారి కుటుంబలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఏమైందో తెలియదు కానీ.. భార్యభర్తలు ఎవరూ ఊహించని చర్యకు పాల్పడ్డారు. భర్త ఆత్మహత్య చేసుకోగా, భార్య గొంతు కోసుకుంది. భర్త మరణించగా, భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) మీరట్‌లో(Meerut) చోటుచేసుకుంది. మీరట్‌లోని పోలీస్ స్టేషన్ ప్రాంతం పరిధిలోని శాస్త్రి నగర్ సెక్టార్ 1‌లో అమిత్ బన్సాల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడు ఇంటీరియర్ డెకరేటర్, ప్లైవుడ్ బిజినెస్ చేస్తున్నాడు. అమిత్ 2016లో పింకీని వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడు నెలల పాప ఉంది. అమిత్ బావమరిది ఐపీఎస్ అధికారిగా ఉన్నారు.

  అమిత్, పింకీల జీవితం హ్యాపీగా సాగిపోతుంది. అయితే అమిత్ ఊహించని నిర్ణయం తీసుకన్నాడు. ఉరి వేసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. ఇది గమనించిన అతని భార్య మెడ, మణికట్టుపై కత్తితో కోసుకుంది. అయితే కొద్దిసేపటి తర్వాత దీనిని గమనించిన వారు.. పింకీని ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆమె ప్రాణాలతో పోరాడుతుందని వైద్యులు తెలిపారు.

  Hyderabad: ఒకే మహిళతో ఇద్దరు వ్యక్తులకు వివాహేతర సంబంధం.. బయటపడ్డ అసలు విషయం.. చివరకు ఇలా..

  మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆధారాలు సేకరించడానికి ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని కూడా ఘటన స్థలానికి పిలిపించారు. అయితే వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. అయితే ఇలా చేయడానిక గల కారణాలను పోలీసులు గుర్తించలేదు. అయితే గది వద్దే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్టుగా పోలీసులు తెలిపారు. అయితే అమిత్ ఆత్మహత్యకు ముందు.. భార్యభర్తల మధ్య గొడవ జరిగినట్టుగా అనుమనాలు వ్యక్తం అవువతున్నాయి.

  Nursing Student: నర్సింగ్ చదువుతున్న యువతి.. రాత్రి వేళ స్నానాల గదిలో షాకింగ్ సీన్.. అయ్యో పాపం..

  ఇందుకు సంబంధించి పోలీసు సూపరింటెండెంట్ వినీత్ భట్నాగర్ (Vineet Bhatnagar) మాట్లాడుతూ.. కుటుంబం వివాహ జీవితం చాలా సంతోషంగా సాగుతుందని కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా తెలిపారు. ఆ కుటుంబానికి ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేవన్నారు. అయితే దంపతులు ఇలా చేయడానికి కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. అమిత్ భార్య పింకీ ఇంకా ఐసీయూలోనే ఉందన్నారు. ఆమె మాట్లాడే స్థితిలో లేదని.. ఆమె మాట్లాడే స్థితికి వస్తే అసలు ఏం జరిగిందనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. అమిత్ రూమ్‌కి వెళ్లి బట్టను కత్తిరించి తాడులా మార్చి ఉరి వేసుకున్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోందన్నారు. అమిత్, పింకీల ఫోన్ డేటాను కూడా విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు.
  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Crime news, Uttar pradesh

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు