UTTAR PRADESH ANOTHER COP RAPES 16 YEAR OLD GIRL IN KASGUNJ ARRESTED PAH
OMG: వెలుగులోకి మరో పోలీసు యవ్వారం... 16 ఏళ్ల బాలికను బైక్ పైన తీసుకెళ్లి..
ప్రతీకాత్మక చిత్రం
Uttar Pradesh: మరో పోలీసు కీచకుడిలా మారాడు. బాలికకు మాయమాటలు చెప్పి బైక్ మీద ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత.. పక్క గ్రామానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
సమాజంలో కొందరు పోలీసులు (Police) కామాంధులుగా ప్రవర్తిస్తున్నారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన వారే.. బరితెగించి ప్రవర్తిస్తున్నారు. మహిళలు, అమ్మాయిల పట్ల దారుణాలకు తెగబడుతున్నారు. కొంత మంది నీచంగా ప్రవర్తించడం వలన డిపార్ట్ మెంట్ అంతా చెడ్డపేరు వస్తుంది. ఈ కోవకు చెందిన ఘటన మరోసారి వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లోని (Uttar pradesh) కాస్ గంజ్ జిల్లాలో ఈ ఉదంతం జరిగింది. అత్రౌలీ గ్రామంలో 16 ఏళ్ల యువతి తమ బంధువుల ఇంటికి వచ్చింది. దీంతో అక్కడికి పనిమీద వచ్చిన పోలీసు, బాలికపై కన్నేశాడు. ఆ తర్వాత బాలికకు మాయమాటలు చెప్పి బైక్ మీద ఎక్కించుకున్నాడు. పక్క గ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడ గదిలో బాలికను అత్యాచారం (Rapes on girl) చేశాడు. ఆ తర్వాత.. ఈ విషయాన్ని ఎవరికైన చెబితే దారుణ పరిస్థితులు ఎదుర్కొంటావంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
బాలిక భయంతో తన ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత.. జరిగిన దారుణాన్ని ఇంట్లో వారితో చెప్పింది. ఈ మేరకు కుటుంబసభ్యులు బాలికపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఈ ఘటన జరిగింది. కాగా, ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. బాలికను పరీకల కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టారు.
ఉత్తర ప్రదేశ్ గతంలో (Uttar pradesh) అమానుషం చోటు చేసుకుంది.
లలిత్ పూర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. గత నెల ఏప్రిల్ 22 న 13 ఏళ్ల బాలికను కొందరు ప్రలోభ పెట్టి భోపాల్ కు తీసుకెళ్లారు. అక్కడ ఒక గదిలో బంధించారు. నలుగురు కలసి నాలుగు రోజుల పాటు (Rape on girl) అత్యాచారం చేశారు. ఆ తర్వాత.. తీవ్ర అపస్మారక స్థితిలో ఉన్న యువతిని ఆమె ఇంటి దగ్గర వదిలేసి నిందితులు పారిపోయారు. అప్పటికే తమ కూతురి ఆచూకీ కోసం వారు వెతుకుతున్నారు.
బాధితురాలు జరిగిన దారుణాన్ని ఇంట్లో వారికి చెప్పింది. దీంతో వారు పోలీసు స్టేషన్ వెళ్ళి ఫిర్యాదు చేశారు. అయితే, స్టేషన్ అధికారి తిలకధారి ఆమెపై కన్నేశాడు. రెండోరోజు ఆమెను స్టేట్ మెంట్ రికార్డు చేయాలని స్టేషన్ కు రప్పించాడు. ఆమె అత్త ముందే.. ఆమెను సెల్ లోనికి తీసుకెళ్లి రేప్ చేశాడు. దీంతో బాధితురాలు షాకింగ్ కు గురయ్యింది. ఆ తర్వాత... వారు ఉన్నతాధికారులకు వెళ్లి జరిగిన దారుణాన్ని తెలిపారు. దీంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.
వెంటనే స్టేషన్ హౌస్ అధికారిని తిలక్ ధారిని సస్పెండ్ చేశారు. ఘటనపై ఉన్నతస్థాయి అధికారులు ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు. ఇప్పటికే రేప్ చేసిన నలుగురు నిందితులలో ఒకరిని లలిత్ పూరి ఎస్పీ నిఖిల్ పాఠక్ వెల్లడించారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.