Home /News /crime /

UTTAR PRADESH AFTER 3 DAYS OF MARRIAGE HUSBAND AND IN LAWS CRUELTY WITH NEWLYWED BRIDE IN BADAUN DETAILS HERE SU

పెళ్లయిన మూడో రోజే ఆసుపత్రిలో చేరిన నవ వధువు.. ఆ భాగంలో ఏడు కుట్లు.. మరీ ఇంత దారుణమా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొత్తగా పెళ్లయి అత్తవారింటంట్లో అడుగుపెట్టిన నవ వధువుకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఎన్నో ఆశలతో భర్తతో కలిసి జీవితాన్ని ఊహించుకుని ఆమె పెళ్లయిన మూడో రోజే.. ఆస్పత్రిలో చేరింది.

    కొత్తగా పెళ్లయి అత్తవారింటంట్లో అడుగుపెట్టిన నవ వధువుకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఎన్నో ఆశలతో భర్తతో కలిసి జీవితాన్ని ఊహించుకుని ఆమె పెళ్లయిన మూడో రోజే.. ఆస్పత్రిలో చేరింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బడాన్ జిల్లాలోని జరీఫ్‌నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఉస్మాన్‌పూర్‌కు చెందిన సునీల్ ఈ నెల 21వ తేదీన సిద్ధార్‌పూర్‌కు చెందిన ఊర్మిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లి వేడుక పూర్తయిన తర్వాత ఉర్మిళ.. భర్తతో కలిసి అత్తివారింటికి వచ్చింది. ఉర్మిళ ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుంచే అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను వేధించడం ప్రారంభించారు.

    జూన్ 24న అంటే పెళ్లి జరిగిన మూడవ రోజే ఉర్మిలను భర్తతో పాటు అత్తమామ తీవ్రంగా కొట్టారు. శరీరంలోని వివిధ భాగాలపై వాతలు కూడా పెట్టారు. దీంతో యువతి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై వధువు తండ్రికి సమాచారం తెలియడంతో.. ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఉర్మిల భర్తతో పాటు అత్తింటివారిపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కట్నం వేధింపులు, దాడికి సంబంధించి ఉర్మిల భర్తతో పాటు మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశారు.

    ఇవి కూడా చదవండి: ఫోన్‌కు వచ్చిన వీడియో చూసి షాక్ తిన్న దంపతులు.. మనీ కోసం బెదిరింపులు.. ఏకంగా 80 వీడియోలు.. ఆ పని చేసింది ఎవరంటే..?

    మరదలిపై కన్నేసిన బావ.. ఐదు హత్యలు.. మృతదేహంతో శృంగారం.. అసలేం జరిగిందంటే..

    ఇక, తన ప్రైవేటు భాగాలపై దాడి చేసినట్టు ఉర్మిళ తెలిపింది. గాయాల కారణంగా ప్రైవేటు భాగంలో వైద్యులు 7 కుట్లు వేశారని చెప్పింది. ఇక, ఈ కేసు జరీఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందినదని బడాన్ ఎస్ఎస్పీ సంకల్ప్ శర్మ తెలిపారు. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొన్నారు. బాధితురాలి వైద్య చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినట్టు చెప్పారు. పోలీసులు ప్రస్తుతం వైద్య నివేదిక కోసం ఎదురు చూస్తున్నారని.. ప్రస్తుతానికి బాధితురాలి భర్తను అరెస్టు చేసినట్టు వెల్లడించారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Domestic Violence, Marriage, Uttar pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు