జంతువులతో కామకేళి.. గుర్రంపై రేప్ ఘటనతో..

జంతువులపై దారుణాలను అరికట్టేందుకు అమెరికాలోని ఓ రాష్ట్రం సంచలన నిర్ణయం తీసుకుంది. జంతువులతో శృంగారం చేసినా, వాటిని రేప్ చేసినా సదరు నిందితులకు కఠిన కారాగార శిక్ష విధించేలా చట్టం తీసుకువస్తోంది.

news18-telugu
Updated: October 9, 2019, 6:21 PM IST
జంతువులతో కామకేళి.. గుర్రంపై రేప్ ఘటనతో..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కొందరు కామాంధులు శ్రుతి మించి ప్రవర్తిస్తుంటారు. ఆడవాళ్లపై, చిన్న పిల్లలపైనే కాకుండా మూగ జీవాలపైనా విరుచుకుపడి తమ వాంఛను తీర్చుకుంటారు. శునకాలు, గుర్రాలు, ఆవులు, ఇతర పెంపుడు జంతువులను మచ్చిక చేసుకొని, వాటిని లొంగదీసుకొని, వాటితో శృంగార కార్యకలాపాలు నెరపుతారు. ఇలాంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇటీవలే.. ఓ మహిళ కుక్కతో, ఓ పురుషుడు ఆవుపై అత్యాచారం చేసిన ఘటనలు బయటపడ్డాయి. అయితే, ఇలాంటి దారుణాలను అరికట్టేందుకు అమెరికాలోని ఓ రాష్ట్రం సంచలన నిర్ణయం తీసుకుంది. జంతువులతో శృంగారం చేసినా, వాటిని రేప్ చేసినా సదరు నిందితులకు కఠిన కారాగార శిక్ష విధించేలా చట్టం తీసుకువస్తోంది. అక్కడి విస్కాన్సిన్ రాష్ట్ర సెనేట్ మంగళవారం ఈ మేరకు దానికి సంబంధించిన బిల్లుకు ఆమోదం తెలిపింది.

అక్కడ ఓ కామాంధుడు గుర్రాన్ని రేప్ చేసిన ఘటన వెలుగు చూడటంతో అక్కడి చట్టసభసభ్యులు బిల్లును రూపొందించి దాన్ని స్టేట్ అసెంబ్లీ ఆమోదానికి పంపారు. అక్కడ ఈ నెల 17న బిల్లుపై చర్చించి, ఆ తర్వాత చట్టబద్ధత కల్పించనున్నారు.


First published: October 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>