హాస్పిటల్‌కు వచ్చే మహిళా రోగులతో అసభ్య ప్రవర్తన.. యువతుల సెక్స్ వీడియోలు తీస్తూ..

Sexual harassment: అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో జార్జ్ టిండాల్(72) గైనకాలజిస్టుగా పనిచేసేవాడు. ఆ సమయంలో తన వద్దకు వచ్చే మహిళా రోగులను శారీరకంగా హింసించేవాడు.

news18-telugu
Updated: July 11, 2019, 2:15 PM IST
హాస్పిటల్‌కు వచ్చే మహిళా రోగులతో అసభ్య ప్రవర్తన.. యువతుల సెక్స్ వీడియోలు తీస్తూ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అతడో డాక్టర్.. రోగం వచ్చిందంటూ తన వద్దకు వస్తే చికిత్స చేయాల్సింది పోయి లైంగికంగా వేధించాడు.. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ దుర్మార్గుడు శారీరకంగా, మానసికంగా హింసించాడు.. మహిళలు అనారోగ్యంతో ఉన్నారని కూడా చూడకుండా వారిపై కన్నేశాడు.. తన కోరిక తీర్చాలంటూ వారిని ఇబ్బంది పెట్టాడు.. అంతేకాదు, విదేశీ మహిళలతో హోటల్ రూమ్‌లలో వ్యభిచారం చేయడం, దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీసి విక్రయిస్తూ తప్పు దారి పట్టాడు. అసలు విషయం బట్టబయలు కావడంతో ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. వివరాల్లోకెళితే.. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో జార్జ్ టిండాల్(72) గైనకాలజిస్టుగా పనిచేసేవాడు. ఆ సమయంలో తన వద్దకు వచ్చే మహిళా రోగులను శారీరకంగా హింసించేవాడు. ఎక్కడెక్కడో కావాలని తాకుతూ వారిని ఇబ్బందులకు గురి చేసేవాడు. రోగం తగ్గిస్తాడని అనుకుంటే అసభ్యంగా ప్రవర్తించడంతో షాక్‌కు గురైన రోగులెందరో..

ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ మహిళ కూడా టిండాల్ వద్దకు చికిత్స కోసం వచ్చింది. శారీరకంగా ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. అలా దాదాపు 16 మంది రోగులను ఇలాగే చేశాడు. అయితే, వేధింపులకు గురైన ఆ మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇతగాడి బాగోతాలన్నీ బట్టబయలయ్యాయి. విదేశీ మహిళలతో సెక్స్ చేయడం, వారి నగ్న చిత్రాలు, వీడియోలు తీయడం లాంటివి కూడా చేసినట్లు తేలింది. పోలీసులు అరెస్టు చేసేందుకు వస్తే వారి నుంచి తప్పించుకోవడానికి లైసెన్సు లేని గన్, బాక్స్ కట్టర్, పెప్పర్ స్ర్పే ఎప్పుడూ తన వద్దే ఉంచుకొనేవాడు. అయితే, ఈ విషయం ముందే తెలిసిన పోలీసులు అతడ్ని చాకచక్యంగా అదుపులోకి తీసుకొని, కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. దోషిగా తేలితే అతడికి భారీ స్థాయి శిక్ష పడే అవకాశం ఉంది.
First published: July 11, 2019, 2:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading