పోర్న్‌సైట్స్‌లో న్యూడ్ వీడియో... హోటెల్‌పై రూ. 707 కోట్లకు దావా వేసిన యువతి...

ప్రఖ్యాత ‘హిల్టన్’ హోటెల్ బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... న్యూడ్ వీడియోను పోర్న్ సైట్స్‌లో అప్‌లోడ్... తనకు జరిగిన అన్యాయానికి, తాను అనుభవించిన మానసిక వేదనకు ప్రతీకగా 100 మిలియన్ డాలర్లు చెల్లించాలని పరువు నష్టం దావా వేసిన యువతి...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: December 6, 2018, 5:19 PM IST
పోర్న్‌సైట్స్‌లో న్యూడ్ వీడియో... హోటెల్‌పై రూ. 707 కోట్లకు దావా వేసిన యువతి...
నమూనా చిత్రం
  • Share this:
పోర్న్ సైట్స్‌తో తన వీడియో ఉండడం చూసి ఓ మహిళ షాక్‌కు గురైంది. కానీ బాధపడుతూ ఊరుకోకుండా అందుకు కారణమైన ఓ ఫైవ్ స్టార్ హోటెల్‌పై రూ. 707 కోట్లకు పరువు నష్టం దావా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. న్యూయార్క్‌లోని హిల్టన్ హోటెల్‌లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. చికాగో ప్రాంతానికి చెందిన ఓ యువతి... 2015 జూలైలో న్యూయార్క్‌లోని ప్రసిద్ధ హిల్టన్ హోటెల్‌కు వెళ్లింది. లా చదువుతున్న సదరు యువతి, బార్ ఎగ్జామ్ కోసం హోటెల్‌లో బస చేసింది. అయితే ఆ తర్వాత మూడేళ్లకు సెప్టెంబర్ 2018లో ఆమెకు ఓ మెయిల్ వచ్చింది. అందులో ఆమె నగ్న వీడియో ఉండడం చూసి ఆ 19 ఏళ్ల యువతి షాక్‌కు గురైంది.

ఆ పూర్తిపేరుతో పోర్న్ సైట్స్‌లో బాత్రూమ్‌ వీడియో ఉండడం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సదరు యువతి... మెయిల్ పంపిన వ్యక్తితో తానో విటుడినని, మీతో సెక్స్ చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పడంతో షాక్ అయ్యింది. యువతి ఎక్కడ చదువుకుంటుందీ, ఎక్కడ పనిచేస్తుందీ తదితర వివరాలను కూడా తెలుసుకున్న ఆ వ్యక్తి... ఆమెకు చాలాసార్లు బెదిరింపు మెయిల్స్ కూడా పంపాడు. అయితే ఆ బెదిరింపులకు ఆమె లొంగకపోవడంతో చాలా పోర్న్‌సైట్స్‌లో ఆమె బాత్రూమ్ వీడియో పెట్టాడు. ఆ యువతి పేరు మీదే ఓ ఫేక్ ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసి...ఆమె స్నేహితులకు, సహోద్యోగులకు, బంధువులకు న్యూడ్ వీడియో పంపాడతను. వీడియో తీసేయాలంటే వెంటనే 2 వేల డాలర్లు ఇవ్వాలని కోరిన అతను... నెలకు వెయ్యి డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దాంతో తన నగ్నవీడియో బయటికి రావడానికి కారణమైన హిల్టన్ హోటెల్‌పై 100 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 707 కోట్లు) పరువు నష్టం దావా వేసిందా యువతి.

హోటెల్‌కు వచ్చిన వారి రక్షణ చూసుకోవాల్సిన బాధ్యతను విస్మరించడం వల్లే... తాను ఈ పరిస్థితిన ఎదుర్కోవాల్సి వచ్చిందని పేర్కొన్న యువతి... మానసికంగా, శారీరకంగా కృంగదీసినందుకు, తీవ్రమైన మనోవేదనకు గురి చేసినందుకు కలిపి... వైద్య ఖర్చులతో సహా ఈ మొత్తాన్ని చెల్లించాలని దావా దాఖలు చేసింది. తనలాగే హెటెల్‌లో దిగిన చాలామంది అమ్మాయిలు, యువతులు ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉండొచ్చని వాపోయిన యువతి... మళ్లీ ఇలాంటివి రిపీట్ కాకూడదంటే గట్టి నష్టం తగలాలని చెప్పింది. అయితే హోటెల్ సిబ్బంది మాత్రం... ‘మా హోటల్‌కు వచ్చేవారికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తాం. కొన్నాళ్ల క్రితం పూర్తిగా రినోవేషన్ చేశాం. ఆ సమయంలో ఇది జరిగి ఉండవచ్చు...’ అని పేర్కొంది.

First published: December 6, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు