Home /News /crime /

US WOMAN RESCUED FROM KIDNAPPER BY USING TIKTOK POPULARIZED SIGNAL FOR HELP TO RAISE ALARM PAH

OMG: బాయ్ ఫ్రెండ్ తో కలిసి హోటల్ కు వెళ్ళిన యువతి.. సీక్రెట్ గా క్యాషియర్ కి సైగలు.. ట్విస్ట్ మాములుగా లేదుగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

United states: యూఎస్ కు చెందిన ఒక 31 ఏళ్ల యువకుడు తన.. ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. అక్కడ వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆమెను బలవంతంగా బయటకు లాక్కొచ్చి కార్ లో పడేశాడు.

Us Woman Rescued From Kidnapper: కొన్ని చోట్ల ప్రేమికులు సైకోలుగా మారుతున్నారు. తమ ప్రియురాలిపట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ప్రేమించిన వారి ఇష్టానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రేమించి వారు.. వారు చెప్పింది వినకుంటే అంతే.. వారిలోని సైకోను నిద్రలేపుతున్నారు. తమ ప్రేమికులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలలో అబ్బాయిలు, అమ్మాయిలు ఏమాత్రం అతీతులు కాదు. కొన్ని చోట్ల అబ్బాయిలు, అమ్మాయిలను మోసం చేస్తుంటే.. మరికొన్ని చోట్ల యువతులు, అబ్బాయిలతో టైంపాస్ లవ్ అంటూ చీట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల యువకులు.. అమ్మాయిలపై భౌతిక దాడులకు పాల్పడటం, యాసిడ్ దాడుల వంటి ఘటనలు మనం చూస్తునే ఉన్నాం.

ఇక కొన్ని చోట్ల యువతులు కూడా.. అబ్బాయిలను మానసికంగా వేధించడం, వారిని తమ అవసరాలకు వాడుకోవడం.. ఇలాంటి సంఘటనలు మనం ప్రతి రోజు వార్తలలో చూస్తునే ఉంటాం. కొన్ని చోట్ల యువతులను కిడ్నాప్ చేయడం వంటివి కూడా వార్తలలో తరచుగా చూస్తునే ఉంటాం. ఈ కోవకు చెందిన ఒక ఘటన ప్రస్తుతం యూఎస్ లో జరిగింది.

యూఎస్ కు చెందిన జానాథన్ స్మిత్ (31), ఒక యువతిని ప్రేమించాడు. కొన్ని రోజుల తర్వాత.. వారి మధ్య గొడవలు వచ్చాయి. ఈ క్రమంలో.. స్మిత్ ఆమె ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగాడు. కోపంతో ఆమెను బైటకు లాక్కొచ్చి కార్ లో పడేశాడు. ఆ తర్వాత.. ఆమెను కొడుతూ నానా హింసలకు గురిచేశాడు. ఈ క్రమంలో అతను.. తన కారులో పెట్రోల్ కొట్టించడం కోసం ఒక బంక్ దగ్గర ఆగాడు. ఆ తర్వాత కారును పార్క్ చేసి, పక్కనే ఉన్న హోటల్ కు వెళ్లాడు. అప్పుడు ఆమె ఇతగాడి బారి నుంచి ఎలాగైన తప్పించుకొవాలని ప్లాన్ వేసింది.

అప్పుడు ఆమెకు ఒక ఐడియా తట్టింది. ఆమె టిక్ టాక్ లో వీడియోలు చేస్తుంటుంది. ఎదైన ఆపదలో ఇరుక్కుంటే.. హ్యాండ్ సిగ్నల్ తో అవతల వారికి చెప్పే విధానం ఆమెకు గుర్తోచ్చింది. వెంటనే ఆమె.. కంటితో సైగచేసి క్యాషియర్ కు తన చేతిని చూపిస్తూ... తన అరచేతిని పైకెత్తి, బొటన వేలిని మడచి దాన్ని మూసివేసింది. ఈ సిగ్నల్ ఆపద సంభవిస్తే..లేదా ప్రమాదంలో ఉంటే దీన్ని ఉపయోగిస్తారు. యువతి సిగ్నల్ ను క్యాషియర్ అర్థం చేసుకున్నాడు.

వెంటనే అతను పోలీస్ హెల్ప్ లైన్ 911 కి సమాచారం అందించాడు. అయితే, వీరి సిగ్నల్ ను పసిగట్టిన స్మిత్ అక్కడి నుంచి ఆమెను బలవంతంగా కారులో కూర్చోబెట్టి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే పోలీసులు వారికి దగ్గరలో ఉన్నారు. వారు ఛేజింగ్ చేసి నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు. ప్రస్తుతం యువతి ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్మిత్ ను అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టారు. టిక్ టాక్ ట్రిక్ తో ఆమె.. ప్రమాదం నుంచి బయట పడింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: America, Crime news, Kidnap

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు