స్పీడ్‌గా వెళ్తుందని మహిళ కారును ఆపిన పోలీసులు.. ఆమె చెప్పిన మాటలు విని షాక్.. తీరా చూస్తే.. మరీ ఇంత ఘోరమా..

ప్రతీకాత్మక చిత్రం

కారు వేగంగా నడుపుతున్న ఓ మహిళను పోలీసులు అడ్డగించారు. అయితే ఆమె వారితో మీరు ఏం చేసిన నేను పట్టించుకోను.. మరో ఐదు రోజుల్లో నేను మీడియాలో సంచలనంగా మారబోతున్నానని అంటూ కామెంట్స్ చేసింది.

 • Share this:
  కారు వేగంగా నడుపుతున్న ఓ మహిళను పోలీసులు అడ్డగించారు. అయితే ఆమె వారితో మీరు ఏం చేసిన నేను పట్టించుకోను.. మరో ఐదు రోజుల్లో నేను మీడియాలో సంచలనంగా మారబోతున్నానని అంటూ కామెంట్స్ చేసింది. అన్నట్టుగానే ఆమె మీడియాలో సంచలనంగా మారింది. అయితే ఏం చేసింది గొప్ప పని కాదు.. ఎవరూ ఊహించని నేరం. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. కఠినమైన నేరానికి పాల్పడింది. ఇద్దరు పిల్లలను కిరాతకంగా చంపి.. మృతదేహాలను కారు డిక్కీలో పెట్టుకోని నెలల పాటు అందులోనే జర్నీ చేస్తుంది. ఈ షాకింగ్ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఈస్ట్ కోస్ట్ సిటీ బాల్టిమోర్‌కు చెందిన నికోలే జాన్సన్.. గతేడాది మే నెలలో ఆమె సోదరి కూతురు(7) చంపేసింది. అనంతరం మృతదేహాన్ని సూట్ కేసులో కుక్కింది. అనంతరం దానిని కారు డిక్కీలో ఉంచి సాధారణంగా వినియోగిస్తుంది.

  ఆ తర్వాత ఏడాదికి బాలిక తమ్ముడి మృతదేహాన్ని కూడా ప్లాస్టిక్ బ్యాగ్‌లో చుట్టి.. కారులోని డిక్కీలో పడేసింది. అయితే బుధవారం అతి వేగం కారణంగా పోలీసులు ఆమె ప్రయాణిస్తున్న కారును అడ్డగించారు. ఆమె వద్ద సరైన పేపర్స్ లేవనే కారణంగా.. కారును జప్తు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఓ అధికారి జాన్సన్‌తో ఆమె వాహనాన్ని తీసుకెళ్లబోతున్నట్టు చెప్పారు. ఇందుకు సమాధానమిచ్చిన జాన్సన్..‘నాకు ఇబ్బందేం లేదు. నేను ఐదు రోజుల్లో ఇక్కడ ఉండను. నేను వార్తల్లో తొలిసారిగా ప్రముఖంగా నిలవబోతున్నాను.. దానిని మీరు అంతా చూడబోతున్నారు’అని పేర్కొంది.

  ఇక, ఇద్దరు పిల్లల సంరక్షణ నిమిత్తం జాన్సన్ సోదరి 2019లో ఆమెకు అప్పగించిందని అధికారులు తెలిపారు. ఇక, బాలికను అనేకసార్లు కొట్టినట్టుగా జాన్సన్‌ విచారణలో అంగీకరించిందని చెప్పారు. నెలకేసి గట్టిగా కొట్టడం వల్ల బాలిక చనిపోయిందని జాన్సన్ తెలిపిందని అన్నారు. అయితే బాలుడిని ఎలా హత్య చేసిందనే విషయాలను జాన్సన్ వివరించలేదని తెలిపారు.
  Published by:Sumanth Kanukula
  First published: