డబ్బు మనిషిని ఎంతటికైన దిగజారుస్తుంది. ఎంతటి దగ్గరి సంబంధాల మధ్య ఐన చిచ్చుపెడుతుంది. కొన్ని చోట్ల తరచు నమ్మిన వాళ్లే మోసాలకు పాల్పడుతున్న అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల ఇంట్లో రక్తసంబంధీకులే మోసాలకు పాల్పడుతున్నారు. మరికొన్ని చోట్ల స్నేహితులు, ప్రాణంగా చూసుకున్న వారే నమ్మక ద్రోహానికి తెగబడుతున్నారు. కొన్ని చోట్ల పనివాళ్లు కూడా డబ్బుల విషయంలో యజమానులకు మోసాలు చేసిన సంఘటనలు అనేకం వార్తలలో నిలిచాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. ఈ ఘటన తమిళనాడులోని (Tamil nadu) చెన్నైలో జరిగింది. శ్రీకాంత్ (60), అనురాధ (55) భార్య భర్తలు. శ్రీకాంత్ చార్టర్ట్ అకౌంటెంట్. వీరు అమెరికాలో వెళ్లి సెటిల్ అయ్యారు. కొన్ని రోజులకు తమ సొంత ఊరు చెన్నై చేరుకున్నారు. కొందరు పనివాళ్లు వారి ఇంట్లో ఉండేవారు. వీరిని శ్రీకాంత్.. ఎంతో నమ్మకంతో చూసుకునే వారు. ఈ క్రమంలో.. యూఎస్ నుంచి వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే .. కృష్ణ న్, రవి పనివాళ్లు కలిసి శ్రీకాంత్, అనురాధలపై మారణాయుధాలతో దాడిచేశారు. ఆ తర్వాత.. వారి ఇంట్లోనే ఉన్న ఫామ్ హౌస్ లో పూడ్చిపెట్టారు.
ఈ క్రమంలో బీరువాలో ఉన్న సుమారు.. 5 కోట్ల నగదు, బంగారు ఆభరణాలను తీసుకొని ఉడాయించారు. ఆ తర్వాత.. అక్కడి నుంచి పారిపోయేందుకు ఏపీ వచ్చేశారు. అయితే, యూఎస్ లో శ్రీకాంత్ కూతురు ఉంటుంది. ఆమె వీరికి ఎన్నిసార్లు ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో భయపడిపోయి అదే గ్రామంలో ఉన్న వారి బంధువులను అప్రమత్తం చేసింది. వెంటనే వారు.. అక్కడికి వెళ్లి చూడగా.. ఇంటిలో ఎవరు లేరు. పైగా పనివాళ్లు కూడా మాయమయ్యారు.
అక్కడ వస్తువులు చిందర వందరగా ఉన్నాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందిచారు. వారు వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులకు కోసం గాలింపుచర్యలు చేపట్టారు.. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే నిందితులను నేపాల్ పారిపోవాలని ప్లాన్ వేస్తున్న వారిని ఒంగోలులో పోలీసులు అరెస్టు చేశారు. తమ దైన రీతిలో ప్రశ్నించగా చేసిన దారుణాన్ని ఒప్పుకున్నారు. కేవలం డబ్బుల కోసమే చంపామని ఒప్పుకున్నారు. ఆ తర్వాత.. వారి ఇంట్లోనే ఫామ్ హౌస్ లో దంపతులను చంపి పాతిపెట్టినట్లు అంగీకరించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.