విమానంలో పదిహేనేళ్ల బాలికతో శృంగారం..ఆటో పైలట్ మోడ్‌లో పెట్టి..

Crime News: విమానం గాల్లో ఉన్నప్పుడు దాన్ని ఆటో పైలట్‌ మోడ్‌(పైలట్ అవసరం లేకుండా విమానం గాల్లో తిరుగుతుంది)లో పెట్టేవాడు. అప్పుడప్పుడు ఆమెను న్యూజెర్సీలో సంపన్నులు నివసించే బెడ్‌మినిస్టర్‌లోని అతడి అతిథి గృహానికి తీసుకెళ్లి సెక్స్‌ చేసేవాడు.

news18-telugu
Updated: May 22, 2019, 7:35 PM IST
విమానంలో పదిహేనేళ్ల బాలికతో శృంగారం..ఆటో పైలట్ మోడ్‌లో పెట్టి..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 22, 2019, 7:35 PM IST
జీవితాంతం కూర్చుండి తిన్నా తరగనంత ఆస్తి.. గొప్ప పేరు ప్రఖ్యాతలు.. సొంతంగా విమానాలు.. పేదలకు సహాయం చేసేంత గొప్ప మనసు.. కానీ, మనవరాలి వయసున్న బాలికను లోబర్చుకుని, ఆమెతో శృంగారం చేశాడో ప్రబుద్ధుడు. పైలట్ శిక్షణ ఇస్తానని ఆమెను తన సొంత విమానంలో ఎక్కించుకొని ఆకాశంలో తిప్పుతూ.. ఆమెతో సెక్స్‌లో పాల్గొన్నాడు. పైగా, ఆటో పైలట్ మోడ్(పైలట్ అవసరం లేకున్నా విమానం గాలిలో తిరుగుతుంది)లో పెట్టి ఆమెతో అత్యాచారానికి పాల్పడ్డాడు. సౌత్ కరోలినాలోని కియావా ద్వీపంలో నివసిస్తున్న 53 ఏళ్ల స్టీఫెన్ బ్రాడ్లే మెల్‌ ధనవంతుడు. సొంతంగా హెలిప్యాడ్‌లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి. ‘ఎయిర్ లైఫ్‌లైన్’ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతూ.. అనారోగ్యంతో ఉన్న పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తన విమానాలు, హెలికాఫ్టర్లలో ఉచితంగా తీసుకెళ్తాడు.

అయితే, స్టీఫెన్‌కు పైలట్ లైసెన్స్ ఉండటంతో ఓ మహిళ తన కూతురికి శిక్షణ ఇవ్వాలని కోరింది. ఇందుకు అంగీకరించిన స్టీఫెన్.. ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చాడు. ఈ క్రమంలో ఆమెను మాత్రమే విమానంలో ఎక్కించుకునేవాడు. పలు మార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విమానం గాల్లో ఉన్నప్పుడు దాన్ని ఆటో పైలట్‌ మోడ్‌(పైలట్ అవసరం లేకుండా విమానం గాల్లో తిరుగుతుంది)లో పెట్టేవాడు. అప్పుడప్పుడు ఆమెను న్యూజెర్సీలో సంపన్నులు నివసించే బెడ్‌మినిస్టర్‌లోని అతడి అతిథి గృహానికి తీసుకెళ్లి సెక్స్‌ చేసేవాడు.

ఆ తర్వాత బాలిక దుస్తులు విప్పించి అత్యాచారానికి పాల్పడేవాడు. అలా, పలు దఫాలు ఆమెతో సెక్స్‌ చేయడమే కాకుండా నగ్నంగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీసేవాడు. శిక్షణ పూర్తయిన తర్వాత కూడా ఆమెపై లైంగిక వేధింపులు కొనసాగాయి. దీంతో ఆ బాలిక జరిగినదంతా ఆమె తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. బాలికతో సెక్స్‌లో పాల్గొన్నందుకు స్టీఫెన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. స్టీఫెన్‌కు ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు.

First published: May 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...