ట్రాన్స్‌జెండర్ హత్యకేసులో పెంబర్టన్‌కు ఊరట... తీర్పుపై సర్వత్రా నిరసనలు

ట్రాన్స్‌జెండర్‌ హత్య ఎందుకు జరిగింది? దోషిని ఎందుకు విడుదల చేశారు? ప్రజలు ఎందుకు నిరసనలు చేస్తున్నారు? పెంబర్టన్ కేసు వివరాలు, తాజా పరిణామాలు తెలుసుకుందాం.

news18-telugu
Updated: September 14, 2020, 12:42 PM IST
ట్రాన్స్‌జెండర్ హత్యకేసులో పెంబర్టన్‌కు ఊరట... తీర్పుపై సర్వత్రా నిరసనలు
ట్రాన్స్‌జెండర్ హత్యకేసులో పెంబర్టన్‌కు ఊరట... తీర్పుపై సర్వత్రా నిరసనలు (credit - CNN))
  • Share this:
ట్రాన్స్ జెండర్ మహిళను చంపిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అమెరికా మెరైన్ జోసెఫ్ స్కాట్ పెంబర్టన్ జైలు నుంచి ఆదివారం విడుదలయ్యాడు. అతనికి ప్రజల నుంచి ప్రమాదం పొంచి ఉండే అవకాశం కనిపిస్తోంది. అందువల్ల అతన్ని ఫిలిప్పీన్స్ నుంచి బహిష్కరించింది కోర్టు. ఈ కేసును విచారించిన అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే ఈ వారం ప్రారంభంలో అతనికి "క్షమాభిక్ష" ఇచ్చారు. జోసెఫ్ స్కాట్ పెంబర్టన్ ట్రాన్స్‌జెండర్ మహిళపై చేసిన హత్యకు సుమారు 10 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. సైనిక విన్యాసాల కోసం ఫిలిప్పీన్స్‌లో ఉన్నప్పుడు 2014 అక్టోబర్‌లో 26 ఏళ్ల జెన్నిఫర్ లాడ్ అనే ట్రాన్స్‌జెండర్ మహిళను మోటెల్ గదిలో చంపినందుకు... పెంబర్టన్‌ దోషిగా తేలాడు. తాజాగా క్షమాభిక్షతో విడుదల చేయడానికి కోర్టు తీర్పు ఇవ్వడంతో నిరసనలు చెలరేగాయి. పెంబర్టన్‌కు నిరసనకారుల నుంచి ప్రమాదం ఉందని గ్రహించిన బ్యూరో... అతన్ని ఫిలిప్పిన్స్ నుంచి బహిష్కరించింది.

బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ కమిషనర్ జైమ్ మోరెంటె మాట్లాడుతూ ‘‘తన బహిష్కరణ ఉత్తర్వు కారణంగా పెంబర్టన్ దేశానికి తిరిగి రాకుండా నిషేధం ఉంది” అని అన్నాడు. క్యూజోన్ నగరంలోని క్యాంప్ అగ్యినాల్డో సైనిక జైలులో శిక్షను అనుభవిస్తున్న పెంబర్టన్ సత్ప్రవర్తనను దృష్టిలో పెట్టుకొని క్షమాభిక్ష ఇవ్వాలని కోర్టు చెప్పిన వారం తరువాత ఈ వివాదాస్పద నిర్ణయం వచ్చింది. అతను సాధారణ ఖైదీలతో కలిసి తన శిక్షను అనుభవించనందున అతనిలో సత్ప్రవర్తన రావడం సహజమే అని కొందరంటున్నారు.

దోషిగా తేలిన సమయంలో 19 సంవత్సరాల వయస్సులో ఉన్న పెంబర్టన్... ఆమెను ఎందుకు చంపావన్న ప్రశ్నకు ఇదివరకే సమాధానం ఇచ్చాడు. ఆమెకు ట్రాన్స్‌జెండర్‌కు పురుష జననేంద్రియాలు ఉన్నాయని తెలియగానే కోపంతో చంపేశానని చెప్పాడు. 2014 అక్టోబర్ 12న ఒలాంగపో హోటల్ గదిలోని టాయిలెట్‌లో లాడ్ డెడ్ బాడీ నగ్నంగా కనిపించింది. ఈ తీర్పుపై నిరసనలు వస్తున్నాయి. 2020 సెప్టెంబర్ 8న ఫిలిప్పీన్‌ రాజధాని మనీలాలో... తీర్పుకి వ్యతిరేకంగా ప్రజలు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.
Published by: Krishna Kumar N
First published: September 14, 2020, 11:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading