చనిపోయిన 35 ఏళ్లకు హతుడెవరో తేలింది.. ఎలాగో తెలుసా?

నిజం నిప్పు లాంటిది.. అది ఎప్పటికైనా బయటకు రావాల్సిందే అనేది అందరికీ తెలిసిందే. ఎంతదాచినా అది దాగదనేది జగమెరిగిన సత్యం.

news18
Updated: October 22, 2020, 11:40 AM IST
చనిపోయిన 35 ఏళ్లకు హతుడెవరో తేలింది.. ఎలాగో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 22, 2020, 11:40 AM IST
  • Share this:
నిజం నిప్పులాంటిది. అది ఎన్నాళ్లకైనా బయటకు రావాల్సిందే. ఎవరైనా అనామకులు చనిపోతే పోలీసులు.. వాళ్లకు సంబంధించిన ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి అడుగుతారని చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వస్తువులో, ఇతర వివరాలనో భద్రంగా ఉంచుతారు. కొన్నాళ్ల తర్వాత అయినా వారి కుటుంబసభ్యులకు ఆ వ్యక్తి ఎలా చనిపోయాడన్న విషయం తెలుస్తుంది. ఇలాంటి ఘటనే ఒకటి అమెరికాలో వెలుగుచూసింది. 35 ఏళ్ల క్రితం హతుడైన వ్యక్తిని గుర్తించారు అమెరికాలోని ఎస్కాంబియా కౌంటీ షెరీఫ్ ఆఫీస్(ఈఎస్సీఓ) పోలీసులు. హతుడి బెల్టుకున్న బకిల్ ఆధారంగా అతడిని కుటుంబ సభ్యులు గుర్తించినట్లు ఈసీఎస్ఓ పోలీసులు గత వారం ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే.. 1985 జనవరి 23న పెన్స్కోలాలో ఓ వ్యక్తి శవాన్ని కనుగొన్నారు. అనామక శవంగా గుర్తించిన పోలీసులు జాన్ డో అని పేరు నమోదు చేశారు. కనపడకుండా పోయిన తన అంకుల్ కోసం 2018లో ఓ వ్యక్తి ఈఎస్సీఓ వెబ్ సైట్ ను సందర్శించాడు. అందులో వివరాల ఆధారంగా పోలీసులను ఆశ్రయించాడు.

అనంతరం పోలీసులు శవాన్ని గుర్తించేందుకు ఆ వ్యక్తిని సంప్రదించారు. హతుడు నలుపు రంగు బెల్టు ధరించి ఉన్నట్లు కుటుంబ సభ్యుడు గుర్తించారు. ఆ బెల్టుపై డబ్ల్యూ.టీ అని ఆంగ్ల అక్షరాలు రాసి ఉండటాన్ని గమనించి పోలీసుల దృష్టికి అతడు ఆ విషయాన్ని తీసుకొచ్చాడు. మరణించిన వ్యక్తి విలియం ఎర్నెస్ట్ థాంప్సన్ అని కుటుంబ సభ్యుడు గుర్తించడంతో పోలీసులు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. అయితే డీఎన్ఏ పరీక్షల్లో కుటుంబ సభ్యుడితో మరణించిన వ్యక్తి డీఎన్ఏ సరిపోలడంతో హతుడు థాంప్సన్ కాదని తేలింది.

ఈ అంశంపై చీఫ్ డెప్యుటీ అధికారి సిమ్మన్స్ స్పందించారు. న్యాయం కోసం అన్వేషణ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుందనడానికి ఇది మరో ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. అయితే హత్య ఎవరు చేసిందనే విషయం ఇంకా గుర్తించలేదని, కాబట్టి కేసు ఇంకా పరిష్కారం కాలేదని ఆయ అన్నారు. కేసు పూర్తయ్యే వరకు కొనసాగుతుందని అన్నారు.

అయితే థాంప్సన్ ఎలా చనిపోయాడు? ఎవరు చంపారనే విషయం ఇంకా తెలియరాలేదు. అంతేకాకుండా కనపడకుండా పోయినట్లు కేసు కూడా లేకపోవడంతో ఈఎస్సీఓ హత్యగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.
Published by: Srinivas Munigala
First published: October 22, 2020, 11:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading