బీచ్‌కు తీసుకెళ్లి, డ్రింక్స్‌లో డ్రగ్స్ కలిపి... ఎయిర్‌హోస్టెస్‌పై పైలట్ల అత్యాచారం...

గత ఏడాది మే నెలలో జరిగిన దారుణం... ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు... తొమ్మిది నెలలుగా న్యాయపోరాటం చేస్తున్న యువతులు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 23, 2019, 7:04 PM IST
బీచ్‌కు తీసుకెళ్లి, డ్రింక్స్‌లో డ్రగ్స్ కలిపి... ఎయిర్‌హోస్టెస్‌పై పైలట్ల అత్యాచారం...
బీచ్‌కు తీసుకెళ్లి, కూల్‌డ్రింగ్స్‌లో డ్రగ్స్ కలిపి... ఎయిర్‌హోస్టర్స్‌పై పైలట్ల అత్యాచారం (నమూనా చిత్రం)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 23, 2019, 7:04 PM IST
అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఒక్కటైన న్యూయార్క్ కేంద్రంగా పని చేసే జెట్‌బ్లూ ఎయిర్‌లైన్స్‌లో పనిచేసే ఇద్దరు పైలట్లపై అత్యాచార ఆరోపణలు ఎదురయ్యాయి. గత ఏడాది మే నెలలో జరిగిన ఈ సంఘటన... తాజాగా వెలుగులోకి వచ్చింది. మే 9న వాసింగ్టన్ నగరం నుంచి ప్యూర్టోరికో ఏరియాకు చేరిన ఎయిర్‌హోస్టర్స్, పైలట్స్ కలిసి ఓ హోటల్‌లో బస చేశారు. సాయంత్రం వేళ సరదాగా బీచ్‌కు వెళ్లాలని అనుకున్నారు ఇద్దరు ఎయిర్ హోస్టర్స్. వారితో పాటు వచ్చిన పైలట్స్ ఎరిక్ జాన్సన్, డాన్ వాట్సన్... ఎయిర్ హోస్టర్స్‌లతో జత కలిశారు. తమతో వస్తే బీచ్‌కు తీసుకెళ్తామని చెప్పారు. యువతలతో కలిసి బీచ్‌కు వెళ్లిన పైలట్స్ అక్కడ సరదాగా ఎంజాయ్ చేశారు. తాగేందుకు శీతల పానీయాలు తీసుకొచ్చిన పైలట్స్... అందులో డ్రగ్స్ కలిపారు. డ్రగ్స్ మత్తులో ఉన్న యువతులపై బీచ్‌లోనే అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటన జరిగిన తర్వాత పైలట్లపై జెట్‌బ్లూ ఎయిర్‌‌లైన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు బాధితులు.

అయితే కలిసి ఎంజాయ్ చేసి, ఇప్పుడు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారంటూ ఎయిర్‌‌లైన్స్ అధికారులు, బాధితుల ఫిర్యాదును పట్టించుకోలేదు. అయితే పైలట్లను వదలకూడదని ఫిక్స్ అయిన ఇద్దరు ఎయిర్ హోస్టర్లు... తొమ్మిది నెలలుగా న్యాయపోరాటం చేస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత డ్రగ్స్ ప్రభావం కారణంగా తమ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని ఆరోపించిన యువతులు... దారుణాన్ని అధికారులు పట్టించుకోకపోవడం వల్ల మానసిక వేదనకు గురయ్యామంటూ గోడు వెల్లబుచ్చుకున్నారు. తాజాగా సదరు పైలట్లపై చర్యలు తీసుకునేందుకు అంగీకరించింది జెట్‌బ్లూ ఎయిర్‌లైన్స్ సంస్థ. ఉద్యోగుల భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహారిస్తామని చెప్పింది.
First published: March 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...