UPSET WITH WIFE DEATH DUE TO CORONA HUSBAND AND TWO DAUGHTERS COMMITS SUICIDE IN KARNATAKA SSR
Heart Breaking: ఎంతో హ్యాపీగా కనిపిస్తున్న ఈ ఫ్యామిలీ ఇప్పుడు మన మధ్య లేదు.. ఏం జరిగిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
సతీష్ రెడ్డి కుటుంబం
అనేకల్ తాలూకా అత్తిబెలిలో నివాసముంటున్న సతీష్ రెడ్డి(45), ఆశా భార్యాభర్తలు. వీరికి మోనిషా(15), కీర్తి(18) అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మోనిషా 9వ తరగతి చదువుతుండగా, కీర్తి బీఎస్సీ ఫస్టియర్ చదువుతోంది.
బెంగళూరు అర్బన్: ‘ఇంటికి దీపం ఇల్లాలు’ అంటుంటారు. వెలుగునిచ్చే ఆ ఇంటి దీపమే ఆరిపోయేసరికి ఆ కుటుంబం తట్టుకోలేకపోయింది. భార్య మృతిని తట్టుకోలేక భర్త.. కన్నతల్లి ఆప్యాయతకు దూరమైన బాధలో ఆమె ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కరోనా మిగిల్చిన కన్నీటి కథ ఇది. ఓ కుటుంబం వ్యధ ఇది. కర్ణాటకలోని బెంగళూరు అర్బన్ జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. అనేకల్ తాలూకా అత్తిబెలిలో నివాసముంటున్న సతీష్ రెడ్డి(45), ఆశా భార్యాభర్తలు. వీరికి మోనిషా(15), కీర్తి(18) అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మోనిషా 9వ తరగతి చదువుతుండగా, కీర్తి బీఎస్సీ ఫస్టియర్ చదువుతోంది. అణకువ కలిగిన ఇల్లాలు, ఎంతగానో తండ్రికి ప్రేమను పంచే కూతుళ్లు.. ఇలా ఎంతో సంతోషంగా సాగిపోతున్న సతీష్‌రెడ్డి జీవితంలో కరోనా కల్లోలం రేపింది. సతీష్ భార్య ఆశాకు ఏప్రిల్‌లో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో.. టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా చాలామందికి వస్తుందిలే.. ఏం కాదులే.. చికిత్స తీసుకుంటే తగ్గుపోతుందని ఆ కుటుంబం ధైర్యంగా ఉంది. కానీ.. సతీష్ రెడ్డి భార్య ఆశా పరిస్థితి విషమించింది. కరోనా వైరస్ ఆమె ఆరోగ్యాన్ని చిదిమేసింది. మే 6న చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. దీంతో.. ఆ కుటుంబం దిగ్భ్రాంతికి లోనైంది. కలకాలం తోడుగా ఉంటానని ఏడడుగులు నడిచిన భార్య ఇక లేదన్న విషయాన్ని సతీష్ రెడ్డి జీర్ణించుకోలేక పోయాడు. అనురాగాన్ని పంచిన అమ్మ లేకుండానే ఇక బతకాలన్న చేదు నిజం తెలిసి కీర్తి, మోనిషా తట్టుకోలేకపోయారు.
ఆశా మరణం ఆ కుటుంబాన్ని కుంగతీసింది. ఇల్లాలి పిలుపు వినిపించక ఆ ఇల్లు మూగబోయింది. ఆశా స్మృతులను గుర్తుచేసుకుంటూ కొన్ని రోజులు గడిపిన సతీష్ రెడ్డి, అతని కూతుర్లు ఆమె లేని జీవితంపై విరక్తి చెందారు. ఆమె లేని ఈ లోకంలో తాము కూడా ఉండకూదనుకున్నారు. మంగళవారం రాత్రి సతీష్ రెడ్డి, కీర్తి, మోనిషా ఉరేసుకుని ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు.
బుధవారం ఉదయం ఎంత సమయమైనా ఎవరూ బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానమొచ్చింది. ఆశా చనిపోయినప్పటి నుంచి ఆ కుటుంబం దిగాలుగా ఉంటోందని స్థానికులు పోలీసులకు చెప్పారు. పోలీసులు వచ్చి చూడగా.. ముగ్గురూ ఉరి వేసుకుని కనిపించారు. ఉరి వేసుకుని అప్పటికే కొన్ని గంటలు గడచిపోవడంతో ఎవరూ ప్రాణాలతో లేరు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంతోషంగా ఉన్న ఓ నిండు కుటుంబాన్ని కరోనా మహమ్మారి ఇలా బలి తీసుకుంది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.