Wife: ముద్దులొలికే బాబు.. ముచ్చటైన ఫ్యామిలీ.. భార్య అలా ఆలోచించకుండా ఉంటే అంతా బాగుండేది..

రమేష్, బాబును ఎత్తుకున్న అను, బాబు

పానిపట్ జిల్లాలోని సివాహ్ గ్రామానికి చెందిన రమేష్ కడియన్ అలియాస్ మాస్సే(28) ఢిల్లీకి చెందిన ప్రాపర్టీ డీలర్‌ పద్మ పన్వర్ వద్ద బౌన్సర్‌గా పనిచేస్తున్నాడు. ఢిల్లీలోని లాక్‌డౌన్ కొనసాగుతున్న కారణంగా దాదాపు నెలన్నర నుంచి భార్య అనుతో కలిసి సొంతూరికి వెళ్లిపోయాడు. వీరికి సంవత్సరం వయసున్న కవీష్ అనే బాబు ఉన్నాడు.

 • Share this:
  పానిపట్: భార్యాభర్తల మధ్య అనుమానానికి ఏమాత్రం తావివ్వకూడదు. పొరపాటున ఒక్కసారి ఏ ఒక్కరి మనసులో అయినా అనుమానం మొదలైందా.. ఆ కాపురంలో కలతలు రేగుతాయి. మనస్పర్థలు మొదలవుతాయి. ఆ అనుమానం పెను భూతంగా మారి చివరికి ప్రాణాలు తీయడానికైనా, తీసుకోవడానికైనా వెనుకాడరు. హర్యానాలోని పానిపట్‌ జిల్లాలో ఉన్న సివాహ్ గ్రామంలో సరిగ్గా ఇదే జరిగింది. భార్య తనపై అనుమానం పెంచుకుందనే మనస్తాపంతో ఆమెను చంపి, ఆమెతో పాటు బిడ్డను చంపి.. తాను ట్రైన్ కింద పడి ఓ 28 ఏళ్ల యువకుడు చనిపోయిన ఘటన కలకలం రేపింది. జీఆర్‌పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పానిపట్ జిల్లాలోని సివాహ్ గ్రామానికి చెందిన రమేష్ కడియన్ అలియాస్ మాస్సే(28) ఢిల్లీకి చెందిన ప్రాపర్టీ డీలర్‌ పద్మ పన్వర్ వద్ద బౌన్సర్‌గా పనిచేస్తున్నాడు. ఢిల్లీలోని లాక్‌డౌన్ కొనసాగుతున్న కారణంగా దాదాపు నెలన్నర నుంచి భార్య అనుతో కలిసి సొంతూరికి వెళ్లిపోయాడు. వీరికి సంవత్సరం వయసున్న కవీష్ అనే బాబు ఉన్నాడు. సివాహ్‌లో కొత్త ఇల్లు కట్టిస్తున్నాడు. అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నప్పటికీ భార్యాభర్తల మధ్య కొన్ని రోజులుగా మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. బౌన్సర్ అయిన తన భర్త వేరే ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అను మనసులో సందేహం మొదలైంది. ఆ సందేహం కాస్తా సంసారంలో గొడవలు మొదలవడానికి కారణమైంది. భర్తను అనుమానిస్తూ రోజూ అను గొడవ పెట్టుకునేది. తనకు ఎవరితోనూ సంబంధాలు లేవని చెప్పినా ఆమె నమ్మేది కాదు. భార్య ప్రవర్తనతో కొన్నిరోజులుగా రమేష్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. సంవత్సరం వయసున్న బాబుతో సంతోషంగా గడుపుతున్న ప్రతిసారి అను తీరు రమేష్‌కు ఇబ్బంది కలిగించేది. ఢిల్లీ నుంచి సొంతూరు వెళ్లాక అను భర్తను మరింతగా అనుమానించడం మొదలుపెట్టింది. సొంతూరులో ఏ అమ్మాయి అతనితో చనువుగా పలకరించినా ఆమె అనుమానపడేది.

  దాదాపు నెలన్నర నుంచి రెండుమూడు రోజులకొకసారి అను, రమేష్ మధ్య గొడవలు జరిగేవి. భార్య ప్రవర్తనతో విసిగిపోయిన రమేష్ క్షణికావేశంలో ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తనకు జీవితంలో మనశ్శాంతి లేకుండా పోయిందని తీవ్ర మనస్తాపం చెందిన రమేష్ జూన్ 3న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఢిల్లీలో ఉన్న తన యజమాని కొడుకు నితిన్ పన్వర్‌కు కాల్ చేశాడు. ఆ ఫోన్‌కాల్‌లో రమేష్ చెప్పిన మాటలు విని నితిన్‌కు చెమటలు పట్టాయి. అనును, పిల్లాడిని చంపేశానని.. తాను కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు వెళుతున్నానని నితిన్‌కు చెప్పి ఫోన్ పెట్టేశాడు. తన బావమరిదికి కూడా ఫోన్ చేసి మీ అక్కను, బాబును చంపేసి.. తానూ చచ్చిపోతున్నానని చెప్పి ఫోన్ కాల్ కట్ చేశాడు. దీంతో.. వెంటనే రమేష్ తండ్రికి అతని బావమరిది కాల్ చేసి బావ ఇలా ఫోన్ చేసి చెప్పాడని కంగారుగా చెప్పాడు.

  ఇది కూడా చదవండి: Guntur: భార్య, ఇద్దరు అత్తలు కలిసి చంపేశారు.. గుంటూరు జిల్లాలో ఘటన.. హత్యకు కారణమేంటంటే...

  తీరా రమేష్ ఉంటున్న గదిలోకి వెళ్లి అతని తండ్రి వెళ్లి చూడగా.. కోడలు అను, మనవడు రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉన్నారు. రమేష్ రూమ్‌లో లేకపోవడంతో రైల్వే ట్రాక్ వద్దకు వెంటనే వెళ్లాడు. అయితే.. అప్పటికే రమేష్ రైలు కింద పడి చనిపోయాడు. 2018లో రమేష్‌కు, అనుకు పెళ్లయిందని.. ఇంటికొచ్చిన ఇన్నిరోజుల్లో కూడా తన కొడుకు, కోడలు ఆప్యాయంగా మాట్లాడుకోవడం చూడలేదని రమేష్ తండ్రి చెప్పాడు. జీఆర్‌పీ పోలీసులు రమేష్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
  Published by:Sambasiva Reddy
  First published: