హోమ్ /వార్తలు /క్రైమ్ /

Suryapet: నీలాంటి మంచోళ్లను బతకనివ్వరు తల్లీ.. నీకు జరిగినట్టు వేరే ఏ ఆడపిల్లకూ జరగకూడదు..

Suryapet: నీలాంటి మంచోళ్లను బతకనివ్వరు తల్లీ.. నీకు జరిగినట్టు వేరే ఏ ఆడపిల్లకూ జరగకూడదు..

బాధితురాలు

బాధితురాలు

సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన కొందరు మనుషుల్లో రోజురోజుకూ పెరిగిపోతున్న వికృత ధోరణులకు అద్దం పడుతుంది. వావివరుసలు మరిచి ప్రవర్తించిన ఓ ఇద్దరు మగాళ్ల కామత్వానికి 23 ఏళ్ల యువతి బలయిపోయింది. ఆ ఇద్దరు కూడా ఆమెకు అయినవారే కావడం గమనార్హం.

ఇంకా చదవండి ...

సూర్యాపేట: కామంతో కళ్లుమూసుకుపోయిన వాడికి వావివరుసలు, చిన్నాపెద్దా తారతమ్యం తెలియదు. సమాజంలో రానురాను ఇలాంటి వారి అకృత్యాలు పెరిగిపోతున్నాయి. బంధాలకు, అనుబంధాలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా కొందరు కామాంధులుగా మారుతున్నారు. కూతురు వరసయ్యే వాళ్లను కూడా వదిలిపెట్టడం లేదు. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన కొందరు మనుషుల్లో రోజురోజుకూ పెరిగిపోతున్న వికృత ధోరణులకు అద్దం పడుతుంది. వావివరుసలు మరిచి ప్రవర్తించిన ఓ ఇద్దరు మగాళ్ల కామత్వానికి 23 ఏళ్ల యువతి బలయిపోయింది. ఆ ఇద్దరు కూడా ఆమెకు అయినవారే కావడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. నేరేడుచర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్ల తల్లిదండ్రులు ఆ అమ్మాయిలు చిన్న వయసులోనే ఉండగానే చనిపోయారు. దీంతో.. పెద్దమ్మాయిని ఆమె పెదనాన్న చేరదీశాడు. చిన్న కూతురిని నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు. ఆమెను పెంచి పెద్ద చేసి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడికి ఇచ్చి వివాహం జరిపించారు. ఇదిలా ఉంటే.. పెదనాన్న కుటుంబంతో కలిసి పెద్దమ్మాయి ఉన్న క్రమంలో.. ఆమె సొంత బాబాయి భార్యకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఆమె శిక్షణకు వెళ్లిన సమయంలో ఆమె భర్తకు రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. దీంతో.. బాబాయిని చూసుకునేందుకు వెళ్లమని చెప్పడంతో ఆ యువతి అప్పటి నుంచి అతనికి సేవలు చేస్తూ ఉంది. ఈ క్రమంలో.. కాలు విరిగి అవస్థ పడుతున్న స్థితిలో కూడా ఆమె బాబాయిలోకి కామంపై మోజు చావలేదు.

అనారోగ్యంతో ఉన్న తనను చూసుకుంటున్న అన్న కూతురికి వీలైతే సాయం చేయాల్సింది పోయి ఆమెపై కన్నేశాడు. ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. సొంత బాబాయే అలా చేయడంతో ఆమె తనలో తానే కుమిలిపోయింది. విషయం తెలిసిన ఆ యువతి పెద్దమ్మ గర్భం తీయించింది. ఈ పీడకల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ యువతి పట్ల ఆమె పెదనాన్న కుమారుడు కూడా తప్పుగా ప్రవర్తించాడు. తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధించేవాడు. వరుసకు చెల్లి అవుతుందనే కనీస స్పృహ కూడా లేకుండా వావివరసులు మరిచి ఆమెను తాకరాని చోట తాకుతూ నీచంగా ప్రవర్తించేవాడు. బాబాయి అలా చేస్తే తనకు అన్నయ్య అయిన వ్యక్తి కూడా ఇలా చేస్తుండటంతో ఆమె జీవితం పట్ల విరక్తి చెందింది.

ఇది కూడా చదవండి: Married Woman: ఒక్క తొందరపాటు నిర్ణయంతో అంతా తలకిందులు.. ఇంత దగ్గరైన వీళ్లిద్దరూ ఎవరో.. ఏం జరిగిందో తెలిస్తే..

అయిన వాళ్లు కూడా తనను కామ దృష్టితో చూడటాన్ని భరించలేకపోయింది. తన తల్లిదండ్రులు బతికే ఉంటే తనకు ఈ స్థితి వచ్చి ఉండేది కాదని తనలో తాను కుమిలిపోయింది. ఇలాంటి మనుషులు తనకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించడం కల్ల అని భావించింది. తీవ్ర మనస్తాపం చెందింది. ఆగస్ట్ 14న పొలంలో నాట్లకు వెళ్లి ఇంటికి వచ్చాక కలుపు మందు తాగింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాధిత యువతి చనిపోయింది. అక్క మృతితో చెల్లెలు కన్నీరుమున్నీరయింది. అయినవాళ్లంతా కలిసి తన అక్కను పొట్టనబెట్టుకున్నారని రోదించింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Crime news, Suryapeta, Telangana crime news, Woman suicide

ఉత్తమ కథలు