Home /News /crime /

UPSET WITH HUSBAND BEHAVIOUR MOTHER OF TWO CHILDREN LOST LIFE IN BALLARI SSR

Married Woman: విషాద ఘటన.. కడుపున పుట్టిన ఈ ఇద్దరి గురించి అయినా ఒక్క క్షణం ఆలోచించి ఉంటే..

పాపను ఎత్తుకున్న సునీత, పక్కన బాబు

పాపను ఎత్తుకున్న సునీత, పక్కన బాబు

బళ్లారిలోని ఇందిరానగర్‌లో సునీత(25), సిద్ధప్ప అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు యశ్వంత్(4) అనే బాబు, శాన్వి(2) అనే పాప ఉన్నారు. సిద్ధప్ప నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

    బెంగళూరు: క్షణికావేశంలో ఆ ఇల్లాలు తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబానికి నూకలు చెల్లేలా చేసింది. భర్తతో మనస్పర్థలు ఆమె జీవితానికి ముగింపు పలికాయి. ఇద్దరు పసిపిల్లలు కూడా భార్యాభర్తల మనస్పర్థలకు బలయిపోయారు. ఈ విషాద ఘటన కర్ణాటకలోని బళ్లారిలో వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బళ్లారిలోని ఇందిరానగర్‌లో సునీత(25), సిద్ధప్ప అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు యశ్వంత్(4) అనే బాబు, శాన్వి(2) అనే పాప ఉన్నారు. సిద్ధప్ప నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లయిన కొన్నేళ్లు భార్యను బాగానే చూసుకున్న సిద్ధప్ప గత కొంత కాలంగా భార్యను తాగొచ్చి వేధిస్తున్నాడు. మద్యానికి బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. పద్ధతి మార్చుకోవాలని.. మనకు ఇద్దరు చిన్నారులున్నారని సునీత పలుమార్లు భర్తకు చెప్పి చూసింది. అయినా సిద్ధప్ప ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. రోజూ తాగొచ్చి భార్యను వేధించసాగాడు. సిద్ధప్ప ప్రవర్తనతో పిల్లలు కూడా భయపడేవారు.

    ఈ క్రమంలోనే ఆదివారం కూడా సునీత, సిద్ధప్ప గొడవ పడ్డారు. భార్యతో గొడవపడి సిద్ధప్ప బయటకు వెళ్లిపోయాడు. రాత్రి 8 గంటల సమయంలో మళ్లీ ఇంటికొచ్చాడు. ఇంట్లో భార్యాపిల్లలు కనిపించలేదు. భార్య అలిగి పిల్లలను తీసుకుని పుట్టింటికి గానీ, బంధువుల ఇంటికి గానీ వెళ్లిందేమోనని సిద్ధప్ప భావించాడు. విచారించగా.. పుట్టింటికి, బంధువుల ఇళ్లకు వెళ్లలేదని తెలిసింది. దీంతో.. సిద్ధప్పకు భయమేసింది. సునీత కుటుంబ సభ్యులు కూడా సిద్ధప్పతో కలిసి ఆమె ఆచూకీ కోసం వెతికారు.

    ఎక్కడా కనిపించకపోవడంతో ఆదివారం అర్ధరాత్రి ఇంటికి వెళ్లగా.. ఇంటి ముందున్న నీళ్ల ట్యాంకులో సునీత, ఇద్దరు పిల్లలు విగత జీవులుగా కనిపించారు. పిల్లలను తోసేసి, తాను కూడా సంపులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. సంపులో నుంచి మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భర్త వ్యసనాలకు బానిస అయి వేధించడం వల్లే సునీత ఇలా చేసి ఉండొచ్చని స్థానికులు అనుకున్నారు. అయితే.. ప్రాణం లేని ఆ చిన్నారుల మృతదేహాలను చూసిన వారి గుండె తరుక్కుపోయింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు భార్యాపిల్లల ప్రాణం తీశాయి.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Family suicide, Karnataka, Wife suicide

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు