కూతురి బాయ్‌ఫ్రెండ్‌ని కాల్చి చంపిన తండ్రి... లవ్ ఎఫైర్‌పై రగిలిపోతూ...

చాలా సినిమాల్లో జరిగినట్లే ఇక్కడ రియల్‌గా జరిగింది. కూతురి బాయ్ ఫ్రెండ్ ప్రాణాలు తీసి ఆ తండ్రి సాధించిందేంటి?

news18-telugu
Updated: July 14, 2020, 1:09 PM IST
కూతురి బాయ్‌ఫ్రెండ్‌ని కాల్చి చంపిన తండ్రి... లవ్ ఎఫైర్‌పై రగిలిపోతూ...
కూతురి బాయ్‌ఫ్రెండ్‌ని కాల్చి చంపిన తండ్రి... లవ్ ఎఫైర్‌పై రగిలిపోతూ... (File - credit - twitter)
  • Share this:
యశ్వంత్ కాంబ్లీ... పుణెలో బిల్డర్. అసలే కరోనా వల్ల రియాల్టీ రంగం పడిపోయి చిరాగ్గా ఉన్నాడు. అలాంటి సమయంలో... ఓ రోజు... తన 19 ఏళ్ల కూతురు ఓ కుర్రాడితో బైకుపై వెళ్లడం చూశాడు. సాయంత్రం ఇంటికొచ్చిన కూతుర్ని హాల్‌లోనే అపి... ఎవడాడు అన్నాడు. ఫ్రెండ్ అని చెప్పింది. "కరోనా కాలం... ఎవరితోనూ ఏ ఫ్రెండ్షిప్లూ వద్దు" అన్నాడు. "సరే నాన్నా" అంటూ తలదించుకొని... మెట్లెక్కి పై అంతస్థులో ఉన్న తన గదికి వెళ్లింది. మరోసారి ఇదే సీన్ రిపీట్ అయ్యింది. బిల్డర్ ప్రత్యర్థి ఫోన్ చేసి... "నీ కూతురు ఓ కుర్రాడితో తిరుగుతోంది. నువ్వు బిల్డర్‌గా సమర్థుడివే గానీ... కూతుర్ని మాత్రం కంట్రోల్‌లో పెట్టుకోలేకపోతున్నావ్" అని కాల్ కట్ చేశాడు. తన శత్రువు తనను అలా అవమానించేసరికి... ఆ బిల్డర్ తండ్రి తట్టుకోలేకపోయాడు. మరోసారి ఇంట్లో పెద్ద రచ్చ జరిగింది. కూతుర్ని మందలించే బదులు... ఆ కుర్రాడికే వార్నింగ్ ఇవ్వొచ్చుగా అని భార్య... అమ్మాయికి సపోర్ట్ ఇచ్చింది. బాగా ఆలోచించాడు. "అవును వాడు తప్పు చేస్తే, నేను నా కూతుర్ని ఎందుకు తిట్టాలి" అనుకున్నాడు.

ఓ రోజు కుర్రాడు అమిత్ మిలింద్‌ని కలిసి... "నాకు బిల్డింగ్‌లు కట్టడమే కాదు... శవాల్ని కప్పెట్టడమూ వచ్చు" అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఆ కుర్రాడు లైట్ తీసుకున్నాడు. మళ్లీ మళ్లీ ఆమెను బైకుపై తిప్పుతూనే ఉన్నాడు. ఓ రోజు ఈ విషయాన్ని తన అనుచరులైన ఆదేష్ నానావారే, ఆయుష్ కాలే ముందు ప్రస్తావించాడు కాంబ్లీ. వాళ్లిద్దరూ అతన్ని రెచ్చగొట్టారు. వాణ్ని లేపేయకపోతే... నీ ఆస్తి మొత్తం తన్నుకుపోతాడు. నీ పరువు పోతుంది. నీ స్థానంలో నేనుంటేనా... ఆణ్ని లేపేసేవాణ్ని" అంటూ రెచ్చగొట్టారు. బాగా ఆలోచించిన కాంబ్లీ... అసలే రియాల్టీ వ్యాపారం సరిగా లేకపోవడంతో... ఫుల్లుగా అప్‌సెట్టై... ఇరిటేషన్ పెరిగి... ఆ కుర్రాణ్ని లేపేయడమే సరైన నిర్ణయం అనుకున్నాడు.

క్యాటరింగ్ బిజినెస్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న అమిత్... ఓ రోజు షాహు వసహత్ దగ్గర... ఓ మూసివున్న హోల్‌సేల్ షాపు ముందు ఆగి ఉండగా... ఓ కారు వచ్చి కుర్రాడి పక్కన ఆగింది. అందులోంచీ బిల్డర్ కాంబ్లీ, అనుచరులు ఆదేష్, కాలే దిగారు. వాళ్లిద్దరు కుర్రాణ్ని పట్టుకోగా... కాంబ్లీ... గన్ తీసి... గుండెలో బుల్లెట్ దింపాడు. వెంటనే వాళ్లిద్దరూ కూడా కత్తులు తీసి... చెరోవైపు నుంచి పొడిచారు. అలా... నడి రోడ్డుపైనే దూరం నుంచి జనం చూస్తుండగా... ఈ మర్డర్ జరిగింది. అమిత్ ఫ్రెండ్ ద్వారా కేసు రాసిన పోలీసులు... ముగ్గుర్నీ అరెస్టు చేశారు. కూతురు, భార్య షాకులో ఉన్నారు. సినిమాల్లో జరిగినట్లే జరిగిన ఈ క్రైమ్ సీన్... స్థానికంగా కలకలం రేపడంలో ఆశ్చర్యం ఏముంది?
Published by: Krishna Kumar N
First published: July 14, 2020, 1:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading