Woman Sucide Over No Toilet : భర్త ఇంట్లో టాయిలెట్ లేకపోవడం ఓ మహిళ ప్రాణాలు పోవడానికి కారణమైంది. కొత్తగా కాపురానికి వెళ్లే అమ్మాయి భర్త ఇంట్లో కనీస సౌకర్యాలు ఉన్నాయో లేవో చూసుకోవటం సాధారణ విషయం. అయితే తాను నివసించాల్సిన చోట మరుగుదొడ్డి లేదని ఒక నూతన వధువు తనువు చాలించిన ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలోచోటు చేసుకుంది.
కడలూరు జిల్లాలోని అరిసిపెరియకుప్పం గ్రామానికి చెందిన రమ్య(27) ప్రైవేట్ఆస్పత్రిలో పని చేస్తోంది. అదే జిల్లాలోని పుథునగర్ కు చెందిన కార్తికేయన్‌తో రమ్య ప్రేమలో పడింది. ఏప్రిల్ 6న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే, భర్త ఇంటికి వెళ్లిన రమ్యకు ఒక్కసారిగా ఊహించని పరిణామం ఎదురైంది. అతడి ఇంట్లో టాయిలెట్ లేదని తెలిసింది. దీంతో పెళ్లైన రెండో రోజే రమ్య..పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి తల్లి దగ్గరే ఉంటోంది. ఇలాగయినా తన భర్త టాయిలెట్ కట్టిస్తాడని రమ్య ఆశపడింది. అయితే భర్త కార్తికేయ మాత్రం ఆ విషయం పట్టించుకోలేదు. ఈ క్రమంలో కడలూర్ లో టాయిలెట్ వసతి ఉన్న ఇల్లు అద్దెకు చూడమని భర్తకు చెప్పింది రమ్య. టాయిలెట్ ఉన్న ఇంటికి మారిపోదామని ఆమె భర్తను పదేపదే కోరింది. ఈవిషయమై గడిచిన కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఇది చినికి చినికి గాలి వాన కావడంతో రమ్య మనస్థాపం చెందింది.
ALSO READ Shocking : బైక్ కు దారి ఇవ్వలేదని..బస్సు డ్రైవర్ ని దారుణంగా కొట్టి చంపారు
ఈ విషయంలో తీవ్ర మనస్తాపానికి గురైన రమ్య సోమవారం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన ఆమె తల్లి మంజుల రమ్యను హుటాహుటిన కడలూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. అక్కడ నుంచి ఆమెను మెరుగైన చికిత్స కోసం పాండిచ్చేరి లోని జిప్‌మర్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించింది .కార్తికేయన్ తీరు వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని మంజుల ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులుచదర్యాప్తు ప్రారంభించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tamilnadu, Toilet, Woman suicide