Home /News /crime /

UPSET OVER FEELING NEGLECTED MAN STABS FATHER TO DEATH MOTHER CRITICAL BA

అపోహతో... అమ్మానాన్నను అతి దారుణంగా...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తనను పట్టించుకోవడం లేదన్న అపోహతో ఓ వ్యక్తి తన సొంత తల్లిదండ్రుల మీద అత్యంత కిరాతకంగా కత్తితో దాడి చేశాడు.

    తనను పట్టించుకోవడం లేదన్న అపోహతో ఓ వ్యక్తి తన సొంత తల్లిదండ్రుల మీద అత్యంత కిరాతకంగా కత్తితో దాడి చేశారు. ఈ దారుణ ఘటనలో తండ్రి చనిపోయాడు. తల్లి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గురుగ్రామ్‌‌కు చెందిన 32 ఏళ్ల రిషబ్ మెహతా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులను కత్తితో పొడవడం తాను కళ్లారా చూశానని రిషబ్ మెహతా సోదరుడు మయాంక్ మెహతా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘ఆ రోజు నేను సరుకులు తీసుకుని రావడానికి మార్కెట్‌కు వెళ్లా. ఇంతలో నాకో ఫోన్ వచ్చింది. మా ఇంటి పక్కన ఉండే అంకుల్ ఫోన్ చేశారు. మా అన్న రిషబ్ మెహతా అమ్మానాన్నను కత్తితో పొడిచి చంపేస్తున్నాడని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పారు. దీంతో నేను వెంటనే పరుగున ఇంటికి వచ్చా. అప్పటికీ రిషబ్ మెహతా నాన్న మీద కత్తితో దాడి చేస్తూనే ఉన్నాడు. అప్పటికే అమ్మకు కడుపు, ఛాతీ, మెడ భాగంలో కత్తిపోట్లు పడ్డాయి. నాన్నను పొడుస్తున్న సమయంలో అతడిని అడ్డుకోబోయా. దీంతో నా మీద కూడా కత్తితో దాడి చేశాడు. నా చేతికి కూడా కత్తి గాయమైంది.’ అని మయాంక్ మెహతా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేవలం తనను నిర్లక్ష్యం చేస్తున్నారన్న కారణంగానే తల్లిదండ్రులను అత్యంత కిరాతకంగా హత్య చేయడానికి రిషబ్ మెహతా ప్రయత్నించాడని పోలీసులు భావిస్తున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Crime, New Delhi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు