ప్రేమ.. సహజీవనం.. అనూహ్య మలుపుతో విషాదాంతం..

క్షణికావేశంలో కల్యాణ్ రెడ్డి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతిని తట్టుకోలేక మానసికంగా కుంగిపోయిన ఆమెను కూకట్‌పల్లిలోని స్వాధర్ హోమ్‌కు తరలించారు.

news18-telugu
Updated: May 18, 2019, 11:31 AM IST
ప్రేమ.. సహజీవనం.. అనూహ్య మలుపుతో విషాదాంతం..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 18, 2019, 11:31 AM IST
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.. కొన్నాళ్లు సహజీవనం కూడా చేశారు.. అంతా సాఫీగానే ఉందనుకున్న తరుణంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. క్షణికావేశంలో అతను ఆత్మహత్య చేసుకోగా.. అతని మృతిని తట్టుకోలేక ఆమె మానసికంగా కుంగిపోయింది. చివరకు తను కూడా బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆత్మహత్య చేసుకోబోతుందన్న విషయం ముందే తెలిసినా.. ఆమెను కాపాడటంలో పోలీసులు విఫలమయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని సుభాష్‌నగర్‌కి చెందిన కల్యాణ్ రెడ్డికి రియాశర్మ అనే అమ్మాయితో కొన్నాళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరి మధ్య సాన్నిహిత్యానికి దారితీసింది. స్విగ్గీలో పనిచేసే కల్యాణ్ రెడ్డి.. నైట్ డ్యూటీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఆమె వద్దకు వెళ్లేవాడు. అలా ఇద్దరు చాలారోజులే సహజీవనం చేశారు. ఉన్నట్టుండి ఒకరోజు ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి.

క్షణికావేశంలో కల్యాణ్ రెడ్డి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతిని తట్టుకోలేక మానసికంగా కుంగిపోయిన ఆమెను కూకట్‌పల్లిలోని స్వాధర్ హోమ్‌కు తరలించారు. అయితే రియా మానసిక పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసులు రియా శర్మను మరో హోమ్‌కు తరలించకుండా సుభాష్‌నగర్‌లో వదిలేసి వెళ్లారు. అప్పటినుంచి ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఈ నెల 7వ తేదీన తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు కల్యాణ్ రెడ్డి సోదరుడికి వాయిస్ మెసేజ్ పంపించింది.


ఇదే విషయంపై పోలీసులకు అతను సమాచారం అందించినప్పటికీ.. ఆమె ఆచూకీ కనుక్కోవడంలో వారు విఫలమయ్యారు. ఆమె మెసేజ్ పంపించిన 36గం. తర్వాత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఆమె బతికేది అన్న వాదన వినిపిస్తోంది.
First published: May 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...