Chennai Couple: లాక్‌డౌన్‌తో ఉద్యోగం పోయింది.. పిల్లలు లేరు.. అప్పుల బాధతో ఆత్మహత్య.. కానీ చనిపోయే ముందు కూడా..

లోకనాథన్, శాంతి దంపతులు (ఫైల్ ఫొటో)

మందవెల్లి ఏఎం గార్డెన్ ప్రాంతంలో లోక్‌నాధన్(55) ఆయన భార్య శాంతి(49)తో కలిసి ఉంటున్నాడు. ఈ దంపతులకు పిల్లలు లేరు. భార్యాభర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. సంతానం కలగలేదని కొన్నాళ్లు ఈ దంపతులు బాధపడినా.. ఆ తర్వాత ఆ లోటును మర్చిపోయేలా భార్యను లోకనాథన్ ప్రేమగా చూసుకున్నారు. ఆయన ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు.

  • Share this:
    చెన్నై: కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్‌తో ఆయన ఉద్యోగం పోయింది. భార్యతో కలిసి ఉంటున్న ఆయనకు పిల్లలు లేరు. చిట్టీలు వేలం పాడిన వారికి డబ్బు కట్టలేక అప్పులపాలయ్యాడు. చివరకు అప్పులిచ్చిన వాళ్ల నుంచి డబ్బు తిరిగి చెల్లించమని ఒత్తిడి పెరగడంతో క్షణికావేశంలో ఆయన తీసుకున్న నిర్ణయం విషాదాన్ని మిగిల్చింది. భార్యాభర్తలిద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఈ విషాద ఘటన తమిళనాడు రాజధాని నగరం చెన్నైలోని మందవెల్లిలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మందవెల్లి ఏఎం గార్డెన్ ప్రాంతంలో లోక్‌నాధన్(55) ఆయన భార్య శాంతి(49)తో కలిసి ఉంటున్నాడు. ఈ దంపతులకు పిల్లలు లేరు. భార్యాభర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. సంతానం కలగలేదని కొన్నాళ్లు ఈ దంపతులు బాధపడినా.. ఆ తర్వాత ఆ లోటును మర్చిపోయేలా భార్యను లోకనాథన్ ప్రేమగా చూసుకున్నారు. ఆయన ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. లోక‌నాథన్ చుట్టుపక్కల ఉన్న వారందరితో మంచిగా ఉండటంతో స్థానికులు ఆయనను ఎంతో నమ్మారు. ఆ నమ్మకంతోనే లోకనాథన్, ఆయన భార్య శాంతి ఇరుగుపొరుగును చందాదారులుగా చేసుకుని చిట్టీలను నడుపుతుండేవారు. కొన్నేళ్లుగా చిట్టీ డబ్బులను సక్రమంగానే చెల్లించిన లోకనాథన్ దంపతులు కొద్ది నెలలుగా కష్టాల్లో కూరుకుపోయారు. కరోనా ఫస్ట్‌వేవ్ నేపథ్యంలో గతేడాది విధించిన లాక్‌డౌన్ కారణంగా లోకనాథన్‌కు ఉద్యోగం పోయింది. దీంతో.. ఈ కుటుంబానికి ఆదాయం నిలిచిపోయింది. ఈ ప్రభావంతో చిట్టీలు కట్టిన వారికి అనుకున్న సమయానికి డబ్బును చెల్లించలేక కొన్ని నెలలుగా ఈ దంపతులు నానా తిప్పలు పడ్డారు. తెలిసిన వాళ్ల దగ్గర లక్షలకు లక్షలు అప్పు చేసి కొందరికి డబ్బు చెల్లించి.. ఏదోలా కుటుంబాన్ని యేడాది పాటు నెట్టుకొచ్చారు.

    ఇది కూడా చదవండి: Bengaluru: ఈమె లైఫ్‌లో ఇలాంటి ఒకరోజు వస్తుందని కలలో కూడా ఊహించి ఉండదు.. విషాద ఘటన..

    కానీ.. లోకనాథన్ అప్పు చేసిన వారి వద్ద నుంచి ఈ మధ్య తిరిగి చెల్లించాలంటూ ఒత్తిడి పెరిగింది. దీంతో.. అటు చిట్టీలు కట్టిన వారికి డబ్బు కట్టలేక, ఇటు అప్పులు తీర్చలేక లోకనాథన్, శాంతి అష్టకష్టాలు పడ్డారు. ఇక.. ఈ బాధలు భరించలేమని భావించి క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో ఇద్దరూ మంగళవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే.. చనిపోయే ముందు కూడా ఈ దంపతులు నిజాయతీ చాటుకున్నారు. ఎవరెవరికి ఎంత అప్పు ఉన్నారో.. ఆ వివరాలను బంధువులకు వాట్సాప్‌లో పంపారు. వారందరికీ ఈ ఇంటిని అమ్మి అప్పు తీర్చమని పేర్కొన్నారు. ఈ దంపతులు ఓ శునకాన్ని పెంచుకునేవారు.

    కొన్నేళ్ల నుంచి ఆ శునకం ఇంట్లో మనిషిలా వీళ్లతో విశ్వాసంగా ఉండేది. తాము చనిపోయిన తర్వాత ఆ శునకాన్ని ఎవరూ చూసుకోరని భావించిన ఈ దంపతులు ఆ శునకం మూతికి ఓ ప్లాస్టిక్ కవర్ కట్టి.. ఆ తర్వాత చనిపోయారు. ఊపిరాడక ఆ శునకం కూడా చనిపోతుందని భావించి అలా కవర్ కట్టినప్పటికీ ఆ శునకం ఎలాగోలా ప్రయత్నించి ఆ కవర్‌ను తొలగించుకుని ప్రాణాలు దక్కించుకుంది. తనను ఎంతో ప్రేమగా చూసుకున్న ఆ దంపతులు ఉరి వేసుకుని చనిపోవడాన్ని చూసిన ఆ శునకం పెద్దగా అరిచింది. ఆ అరుపులకు చుట్టుపక్కల వాళ్లు ఇంట్లోకి వచ్చి చూడటంతో ఈ దంపతులు చనిపోయిన సంగతి బయటికొచ్చింది. పోలీసులు వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాయపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
    Published by:Sambasiva Reddy
    First published: