‘దిశ’ ఘటనపై ఉప్పల్ బాలు తీవ్ర వ్యాఖ్యలు..

షాద్‌నగర్ నిర్భయ ఘటనపై ఫేమస్ టిక్‌టాక్ స్టార్ ఉప్పల్ బాలు స్పందించాడు. ఘటన జరిగి రెండ్రోజులు అవుతోందని, ఇంకా నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించాడు.

news18-telugu
Updated: December 2, 2019, 12:24 PM IST
‘దిశ’ ఘటనపై ఉప్పల్ బాలు తీవ్ర వ్యాఖ్యలు..
ఉప్పల్ బాలు
  • Share this:
షాద్‌నగర్ నిర్భయ ఘటనపై యావత్తు దేశం స్పందిస్తూనే ఉంది. ఇంతటి ఘోరాలకు పాల్పడే నిందితులను ఉరి తీయాలని, నడిరోడ్డుపై రాళ్లతో కొట్టి చంపాలని తమ ఆవేశాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. తాజాగా, ఈ ఘటనపై ఫేమస్ టిక్‌టాక్ స్టార్ ఉప్పల్ బాలు స్పందించాడు. ఘటన జరిగి రెండ్రోజులు అవుతోందని, ఇంకా నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించాడు. వాళ్లను అరెస్టు చేసి జైల్లో పూజ చేసి, టెంకాయ కొడతారా? అని అడిగాడు. అంత క్రూరంగా వ్యవహరించిన వాళ్లను ఉరి తీయక.. టీవీలలో వాళ్లను చూపించి షోలు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కామాంధులను ప్రజల ముందుకు తీసుకొస్తే నరికి పారేస్తారని, మరోసారి ఎవరైనా ఇలా చేయాలంటే భయపడతారని వ్యాఖ్యానించాడు. వాళ్లను టీవీల్లో ఎంతసేపు చూడాలని, ధర్నాలు చేయాలా? తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు.

నిందితులను బయటికి తీసుకొస్తే గొంతు పిసికి చంపేయాలన్నంత కోపం వస్తోందని, జనం తొక్కి పారేస్తారని అన్నాడు. వాళ్లను చూస్తుంటే రక్తం మరుగుతోందని, చంపితేనే తనకు మనశ్శాంతి కలుగుతుందని తెలిపాడు. రేప్ చేయాలని ఎవరికైనా ఆలోచన వస్తే.. ఇంత ఘోరంగా చంపుతారా? అన్నంతగా ఈ కామాంధులను చంపాలని తన ఆవేశాన్ని వెల్లగక్కాడు.

First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>