పాములు ఆ పనిలో ఉండగా... వాటి పై కూర్చున్న మహిళ

బెడ్ రూంలోకి వెళ్లిన గీత భర్తతో ఫోన్లో మాట్లాడుతూ.. వెళ్లి పాములను చూడకుండా మంచంపై కూర్చొంది. అప్పటికే మంచంపై మంచి మూడ్‌లో ఉన్న రెండు పాములు ఆడుతున్నాయి.

news18-telugu
Updated: September 12, 2019, 11:30 AM IST
పాములు ఆ పనిలో ఉండగా... వాటి పై కూర్చున్న మహిళ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సెల్ ఫోన్ మోజులో పడి జనం ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. సెల్ చేతికి వస్తే చాలు... లోకం మరిచిపోతారు. పక్కన కొంపలు అంటుకున్నా కూడా పట్టించుకోవడం లేదు. సెల్ ఫోన్ చూస్తూ... అందులో మునిగిన మహిళ... రెండు పాములపై కూర్చొంది. అంతే వెంటనే అవి ఆమెను కాటేశాయి. దీంతో పాములు కాటేసిన కాసేపటికే ఆ మహిళ మృతి చెందింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ ఘోరక్‌పూర్‌లోని రియనావ్ గ్రామంలో చోటు చేసుకుంది.

గీతా అనే వివాహిత గ్రామంలో నివసిస్తుంది. ఆమె భర్త జైసింగ్ యాదవ్ థాయ్‌లాండ్‌లో ఉంటున్నాడు. విదేశాల్లో ఉన్న భర్త జైసింగ్ యాదవ్‌తో గీత ఫోన్లో మాట్లాడుతుంది. ఈ ధ్యాసలో పడి ఇంటిలోకి ప్రవేశించిన పాముల విషయాన్ని గమనించలేకపోయింది. ఇంట్లోకు వెళ్లిన రెండుపాములు మంచం ఎక్కి ఆడుతున్నాయి. అయితే బెడ్‌పై పరిచిన ప్రింటెడ్ బెడ్ షీట్ కావడంతో... వాటిపై పాములున్న విషయాన్ని గీత గుర్తించలేదు. బెడ్ రూంలోకి వెళ్లిన గీత భర్తతో ఫోన్లో మాట్లాడుతూ.. వెళ్లి పాములను చూడకుండా మంచంపై కూర్చొంది. అంటే అప్పటికై మంచంపై ఆడుతున్న ఆ రెండు పాములు గీతను కాటేశాయి. దీంతో గీత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే గీతను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు వదిలింది.

ఆస్పత్రి నుంచి కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వారు ఇంటికొచ్చారు. అప్పటికే కూడా ఇంట్లోనే పాములు మంచంపై ఆడటాన్ని గుర్తించారు. ఆగ్రహంతో రెండు పాముల్ని కొట్టి చంపేశారు. అయితే గీత పాములపై కూర్చున్నప్పుడు... పాములు స్పష్టంగా సంభోగం చేస్తున్నాయని పశువైద్య నిపుణులు తెలిపారు. అందుకే అవి ఆమెను కాటేశాయన్నారు.First published: September 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు