హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: కొద్ది రోజుల్లోనే తన పెళ్లి.. వెడ్డింగ్ కార్డులు పంచడానికి వెళ్లిన యువతికి ఊహించని షాక్.. అసలేం జరిగిందంటే..

Shocking: కొద్ది రోజుల్లోనే తన పెళ్లి.. వెడ్డింగ్ కార్డులు పంచడానికి వెళ్లిన యువతికి ఊహించని షాక్.. అసలేం జరిగిందంటే..

బాధిత యువతి

బాధిత యువతి

Uttar pradesh: యువతికి పెళ్లి సెటిల్ అయ్యింది. గ్రామంలోని బంధువులు, స్నేహితులకు వెడ్డింగ్ కార్డులు ఇవ్వడానికి వెళ్లింది. ఈ క్రమంలో ముగ్గురు యువకులు ఆమెను ఫాలో అయ్యారు.

మహిళలపై అమానుష దాడులు, అత్యాచార ఘటనలు (Woman harassment)  ప్రతి రోజు వార్తలలో ఉంటున్నాయి. ప్రభుత్వాలు దిశ, నిర్భయ వంటి కఠిన చట్టాలు తీసుకొచ్చిన ఈ కామాంధులలో మార్పులు రావడం లేదు. తన పెళ్లి సెటిల్ అయ్యిందని ఆనందంతో పెళ్లి కార్డులు పంచడానికి వెళ్లిన యువతిపై కొంత మంది యువకులు సాముహిక అత్యాచారానికి (Gang rape) పాల్పడ్డారు.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్  లోని (Uttar pradesh) ఝాన్సీలో అమానుష ఘటన జరిగింది. ఒక యువతిపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు కిడ్నాప్ (kidnap) చేశారు. ఆ తర్వాత.. అత్యాచారం చేసి యువతిని మరోకరికి అమ్మేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఝాన్సీకి చెందిన యువతి తన పెళ్లి సెటిల్ అయ్యిందని గ్రామంలో పెళ్ళి కార్డులు (Wedding cord distribution) పంచడానికి వెళ్లింది. ఆమె పెళ్లి (Wedding)  ఏప్రిల్ 21 న సెటిల్ అయ్యింది. ఈ క్రమంలో ఆమె ఏప్రిల్ 18న గ్రామంలో పత్రికలు పంచడానికి వెళ్లింది. అప్పుడు ముగ్గురు యువకులు ఆమెపై కన్నేశారు. ఆమెకు మాయమాటలు చెప్పారు.

తెలిసిన వారేకావడంతో ఆమె వారి గదిలోనికి వెళ్లింది. ఆ తర్వాత మత్తుపానీయం ఇచ్చి ఆమెను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ముగ్గురు అత్యాచారం చేశారు. ఈ క్రమంలో యువతిని మధ్య ప్రదేశ్ లోని (Madhya pradesh)  మరోకరికి అమ్మేశారు. యువతి అపస్మారక స్థితి నుంచి తెరుకున్నాక.. మెల్లగా అక్కడి నుంచి పారిపోయి బయటకు వచ్చింది. వెంటనే అక్కడి నుంచి బస్సులో తన గ్రామానికి చేరుకుంది. జరిగిన దారుణాన్ని తన ఇంట్లో వారికి చెప్పింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకొవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోనికి దింపారు.

పూణెలో యువతిపై ఒక వ్యక్తి గతంలో అత్యాచారానికి ప్రయత్నించాడు.

పూణెకు (Pune) చెందిన యువతికి ఆన్ లైన్ డేటింగ్ (Dating app) అప్లికేషన్ యాప్ లో ముఖేష్ సూరవంశీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

అది కాస్త స్నేహంగా మారి ఒకరిని మరోకరు తరచుగా కలుసుకునే వారు. తాను సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని, సమ్మర్ వేకేషన్ కోసం మాల్దీవులకు వెళ్దామని యువతికి ఆఫర్ ఇచ్చాడు. యువతి అతగాడి మనసులో ఉన్న వంకర బుద్ధిని కనిపెట్టలేకపోయింది. దీంతో ఇద్దరు కలిసి మాల్దీవులకు వెళ్లారు. అక్కడ హోటల్ లో బసచేశారు. ఆ తర్వాత... వీరిద్దరు కలసి అక్కడ తిరిగారు. యువతి, దగ్గర నుంచి ఖర్చుల కోసం యాభై వేలను తీసుకొన్నాడు. ఈ క్రమంలో.. హోటల్ లో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. ముద్దులు పెడుతూ, తనతో గడపాలని బలవంతం చేశాడు. దీంతో షాకింగ్ కు గురైన మహిళ వెంటనే బయటకు వచ్చేసింది. ఆ తర్వాత.. తన స్వగ్రామానికి వెళ్లి జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

First published:

Tags: Female harassment, Gang rape, Harassment on women, Uttar pradesh

ఉత్తమ కథలు