Chinthakindhi.RamuChinthakindhi.Ramu
|
news18-telugu
Updated: November 15, 2018, 11:33 AM IST
ప్రతీకాత్మక చిత్రం
సాధారణ మహిళలకే కాదు, రక్షణ శాఖలో ఉన్నవారికి కూడా వేధింపులు తప్పడం లేదు. తాజాగా హోంగార్డుగా పనిచేస్తున్న ఓ మహిళపై బస్ కండక్టర్ అఘాయిత్యానికి ఒడిగట్టిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. రోజూ లాగే ఆర్టీసీ బస్సులో విధులకు వెళ్తున్న మహిళా హోంగార్డును లైంగికంగా వేధింపులకు గురిచేసిన బస్ కండక్టర్, ఆమెపై దాడి తీవ్రంగా దాడి చేశాడు. బస్సులో ప్రయాణికులందరూ చూస్తుండగా జరిగిన ఈ దారుణ సంఘటన యూపీలో సంచలనం క్రియేట్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే... సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ బస్సులో విధులకు బయలు దేరింది.
ఆ బస్ కండక్టర్ ఆమెను అసభ్యంగా తాకుతూ వెళ్లాడు. దాంతో ఆగ్రహానికి గురైన సదరు మహిళ, బస్ కండక్టర్‌తో వాగ్వాదానికి దిగింది. మాటా మాటా పెరగడంతో బస్సులో ప్రయాణికులందరూ చూస్తుండగానే ఆమె బట్టలు లాగేందుకు ప్రయత్నించాడు కండక్టర్. అతన్ని హోంగార్డ్ అడ్డగించడంతో ఆమెపై దాడి చేశాడు. తోటి మహిళలు అడ్డుకోవడంతో అతని నుంచి తప్పించుకున్న మహిళా హోంగార్డు దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Published by:
Ramu Chinthakindhi
First published:
November 14, 2018, 2:54 PM IST