హోమ్ /వార్తలు /క్రైమ్ /

Caesarean Surgery: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. మహిళ కడుపులో వస్త్రం పెట్టి  కుట్లు వేసిన వైద్యులు..

Caesarean Surgery: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. మహిళ కడుపులో వస్త్రం పెట్టి  కుట్లు వేసిన వైద్యులు..

దీంతో ఆరోగ్యం బాగా క్షిణించడంతో విషయాన్ని మూడు రోజుల క్రితమే తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అలర్ట్ అయిన తల్లిదండ్రులు ఆమెను హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స ప్రారంభించారు.

దీంతో ఆరోగ్యం బాగా క్షిణించడంతో విషయాన్ని మూడు రోజుల క్రితమే తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అలర్ట్ అయిన తల్లిదండ్రులు ఆమెను హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స ప్రారంభించారు.

Caesarean Surgery: ఉత్తరప్రదేశ్‌లోని షాజహన్‌పూర్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల వైద్యుల నిర్లక్ష్యంతో ఒక మహిళ ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. సిజేరియన్ చేసిన సమయంలో వైద్యులు ఆమె కడుపులో ఏకంగా ఒక వస్త్రాన్ని వదిలేసి కుట్లు వేశారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది.

ఇంకా చదవండి ...

పేద ప్రజలకు వైద్య సేవలను చేరువ చేయాల్సిన ప్రభుత్వ వైద్యశాలలు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ప్రైవేటు హాస్పిటళ్లలో చికిత్స తీసుకోలేని వారికి వైద్య సేవలు ఇప్పటికీ సరిగ్గా అందట్లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని షాజహన్‌పూర్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల వైద్యుల నిర్లక్ష్యంతో ఒక మహిళ ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. సిజేరియన్ చేసిన సమయంలో వైద్యులు ఆమె కడుపులో ఏకంగా ఒక వస్త్రాన్ని వదిలేసి కుట్లు వేశారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో బాధితురాలు సిజేరియన్ చేయించుకుంది. షాజహన్‌పూర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల వైద్యులు ఆమెకు ప్రసవం చేశారు. అనంతరం సిజేరియన్ ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో బాధితురాలి కడుపులో ఒక గుడ్డ ముక్కను వదిలిపెట్టారని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు షాజహాన్‌పూర్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. నివేదిక ఆధారంగా నిర్లక్ష్యం వహించిన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేష్ కుమార్ బుధవారం తెలిపారు.

షాజహాన్‌పూర్‌ ప్రాంతానికి చెందిన మనోజ్ అనే వ్యక్తి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. జనవరి 6న అతడి భార్య నీలం ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం సిజేరియన్ చేసిన వైద్యులు, ఆమె కడుపులో ఒక వస్త్రాన్ని వదిలేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై అతడు విలేకరులతో మాట్లాడాడు. ‘పాప పుట్టిన తరువాత నా భార్య విపరీతమైన కడుపు నొప్పితో బాధపడింది. దీంతో షాజహాన్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఆమెను చేర్పించాను. అక్కడ CT స్కాన్ చేసిన డాక్టర్లు, ఆమె కడుపులో ఒక గుడ్డ ముక్క ఉందని చెప్పారు. ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. ఆ తరువాత కూడా ఆమె పరిస్థితి మెరుగుపడలేదు.

దీంతో నా భార్యను లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చేర్పించాం. ఇప్పటికీ వెంటిలేర్‌ సాయంతో చికిత్స అందిస్తున్నారు. సిజేరియన్ సమయంలో నిర్లక్ష్యం కారణంగానే నా భార్య ప్రాణాలతో పోరాడే స్థితికి చేరుకుంది. ఇందుకు కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి’ అని బాధితురాలి భర్త వాపోయాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే విచారణ కమిటీని ఏర్పాటు చేసి, దర్యాప్తునకు ఆదేశించామని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మీడియాకు చెప్పారు. నివేదిక ఆధారంగా నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Published by:Veera Babu
First published:

Tags: Doctors, Medical college, Uttarapradesh, Womens

ఉత్తమ కథలు