మానవ శరీరంలో ఎముకల సంఖ్య ఎంత? నాలుగు, ఐదో తరగతి చదువుతున్న పిల్లాడిని అడిగిన చాలా తేలిగ్గా... 206 అని చెప్పేస్తాడు. అయితే ప్రైమరీ టీచర్ సెలక్షన్‌లో టాపర్‌గా నిలిచిన ఉపాధ్యాయుడు మాత్రం... ఓ 50 ఎక్కువ జత చేసి... 256 అని చెప్పాడు. అంతే... మానవ శరీరంలో ఉన్న ఎముకల సంఖ్య సరిగ్గా చెప్పలేని వ్యక్తి, ప్రైమరీ టీచర్ సెలక్షన్స్‌లో టాపర్‌గా ఎలా నిలిచాడు? కచ్ఛితంగా ఏదో ఛీటింగ్ చేసే ఉంటాడని అతన్ని అరెస్ట్ చేశారు అధికారులు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ‘హ్యుమన్ బోన్స్ కౌంట్’ ఫజిల్ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
2015 ఏడాదిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన ప్రైమరీ టీచర్ సెలక్షన్స్‌లో అశీష్ కుమార్ అనే 28 ఏళ్ల యువకుడు... 88 శాతం మార్కులు సాధించి టాపర్‌గా నిలిచాడు. ఫికోహాబాద్‌లో ఉంటూ... మెరిట్ ఆధారంగా లభించిన ప్రైమరీ టీచర్‌గా ఉద్యోగం కూడా చేస్తున్నాడు. 2018లో ఉమేద్‌పూర్ ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా నియమాకం పొందిన అశీష్... ఆ సమయంలో అతని మార్క్స్ షీట్ క్రాస్ వెరిఫికేషన్ జరగలేదని సమాచారం మీడియాకు అందింది. దాంతో టీచర్ల నియామకాల్లో అవతవకలు జరిగాయని కథనాలు వచ్చాయి. దీంతో ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించారు అధికారులు. టాపర్ అయిన ఆశీష్ కుమార్‌ను ఇంటర్వ్యూ చేసిన అధికారులు... ప్రైమరీ స్కూల్ పిల్లలు కూడా తేలిగ్గా చెప్పే ప్రశ్నలకు కూడా మనోడు సమాధానం చెప్పలేకపోయాడు. ‘మానవ శరీరంలో 256 ఎముకలు ఉంటాయి’ అని తనకు తోచిన సంఖ్య చెప్పాడు. టీటీఈకి ఫుల్‌ఫార్మ్ చెప్పమని అడిగితే.. ‘ఫార్మ్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్’ అని చెప్పాడు. చివరికి గుణింతాలు, కూడికలు, తీసివేతలు కూడా సరిగ్గా చెప్పలేకపోవడంతో అధికారులు అవాక్కయ్యారు. దాంతో ఫేక్ మార్క్స్ షీట్ క్రియేట్ చేసి... ఛీటింగ్ చేసి ఉద్యోగం సంపాదించాడని నిర్ధారించుకున్న అధికారులు... అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అశీష్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు... అతనికి ఎవ్వరెవ్వరు సహకరించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime